Saturday, April 19, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిముగిసిన రాష్ట్ర స్థాయి హాకీ పోటీలు

ముగిసిన రాష్ట్ర స్థాయి హాకీ పోటీలు

విశాలాంధ్ర -ధర్మవరం ; పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాల క్రీడా మైదానంలో ఈనెల ఆరవ తేదీ నుంచి 9వ తేదీ వరకు రాష్ట్ర హాకీ పోటీలు నిర్వహించారు. నాలుగు రోజులపాటు నిర్వహించిన ఈ హాకీ పోటీలకు రాష్ట్రవ్యాప్తంగా హాకీ క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చూపడం జరిగింది. చివరి రోజున సెమీఫైనల్, ఫైనల్ నిర్వహించారు. సెమీ ఫైనల్ లో తిరుపతి-కాకినాడ (0-1), అన్నమయ్య-కడప (4-5), కాకినాడ- కడప (2-0), అన్నమయ్య-తిరుపతి (3-1),(సూట్ అవుట్) సెమీఫైనల్ పోటీలు జరిగాయి. తదుపరి ఫైనల్ పోటీల్లో కాకినాడ -కడప (2-0), విన్నర్స్ గా కాకినాడ, సెకండ్ లో కడప జిల్లా, థర్డ్ లో అన్నమయ్య జిల్లా కైవాసం చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ధర్మారం ఎమ్మెల్యే, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పాల్గొని, హాకీ క్రీడలో పాల్గొన్న వారందరికీ కూడా అభినందన శుభాకాంక్షలు తెలుపుతూ, గెలుపొందిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ హాకీ పోటీలను విజయవంతం చేసిన వారందరికీ కూడా వారు కృతజ్ఞతలను తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ హాకీ టర్బో కోర్టును వీలైనంత త్వరలో ధర్మవరంలో ఏర్పాటు చేస్తారని వారు హామీ ఇచ్చారు. ధర్మారంలో ఏ క్రీడలైనా సరే రాష్ట్ర జాతీయ స్థాయికి వెళుతుండడం నిజంగా నిర్వాహకులు యొక్క కృషి శ్రమ అని తెలుపుతూ వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు చాణిక్య రాజు, కోశాధికారి తామస్ పీటర్, హాకీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్య ప్రకాష్, సత్యసాయి జిల్లా ఉపాధ్యక్షులు గౌరీ ప్రసాద్, ఉడుగుల రామచంద్ర, ఊకా రాఘవేంద్ర, మహమ్మద్ అస్లాం, ట్రెజరర్ అంజన్న, అరవింద గౌడ్, చందు, డైరెక్టర్లు మారుతీ ప్రసాద్, ఇర్షాద్, అమురుద్దీన్, కిరణ్, జిల్లా హాకీ కోచ్, జిల్లాల హాకీ అధ్యక్షులు ,కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు