Saturday, April 19, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిసకాలంలో రేషన్ సరుకులు పంపిణీ చేయాలి..

సకాలంలో రేషన్ సరుకులు పంపిణీ చేయాలి..

ముదిగుబ్బ సిపిఐ నాయకులు-చల్లా శ్రీనివాసులు

విశాలాంధ్ర ముదిగుబ్బ/ ధర్మవరం; ముదిగుబ్బ మండలంలో రేషన్ సరుకుల పంపిణీ సకాలంలో జరగపోవడంతో లబ్ధిదారులు తీవ్ర నిరాశకు గురవుతున్నారని సిపిఐ పార్టీ నాయకులు చల్లా శ్రీనివాసులు మంగళవారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు ఆధ్వర్యంలో సిపిఐ నాయకులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రేషన్ సరుకుల పంపిణీ విషయంలో సంబంధిత అధికారుల అలసత్వం, కూటమి నాయకుల నిర్లక్ష్యం తదితర కారణాలతో మండలంలో గత కొన్ని నెలలుగా రేషన్ సరుకుల పంపిణీ అస్తవ్యస్తంగా తయారయిందని విమర్శించారు. ముఖ్యంగా డీలర్లు గత వైసిపి ప్రభుత్వంలో నిర్మించిన ఎండియు ఆపరేటర్ల మీద ఆధారపడి సరుకులు పంపిణీ చేయాల్సి రావడంతో సకాలంలో రేషన్ సరుకులు పంపిణీ జరక్క కార్డుదారులు గంటలు, రోజుల తరబడి డీలర్ల వద్ద వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.ముఖ్యంగా కూలీలు తమ పనులను సైతం పక్కనపెట్టి ఈ సరుకుల కోసం డీలర్ల వద్ద రోజుల తరబడి వేచి చూడాల్సిన దుర్భర పరిస్థితి నెలకొందని సిపిఐ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా బఫర్ స్టాక్ పేరుతో అధికారులు స్టాక్ పాయింట్ నుంచి డీలర్లకు వాళ్లకు నిర్ణయించిన కోటా కంటే తక్కువ మొత్తంలో బియ్యం సరఫరా చేస్తుండడంతో డీలర్లు కార్డుదారుల అందరికీ పంపిణీ చేయలేక కొంతమందిని వెనక్కి పంపించాల్సిన దుర్భర పరిస్థితి ఏర్పడుతుండడంతో
ఆ కార్డుదారులు లబోదిబోమంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు, దీనికి తోడు డీలర్లకు స్టాక్ పాయింట్ నుంచే ప్యాకెట్ కు నాలుగు నుంచి ఐదు కేజీలు తక్కువగా ఇస్తుండడంతో ఇదే అదునుగా డీలర్లు కూడా ప్రజలకు తూకాల్లో కోత పెడుతున్నారని పేర్కొన్నారు. కనుక ఇప్పటికైనా అధికారులు, కూటమి నాయకులు తక్షణమే స్పందించి రేషన్ సరుకుల పంపిణీ సక్రమంగా సకాలంలో జరిగేటట్లు చర్యలు తీసుకోకపోతే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రేషన్ కార్డుదారులతో కలిసి త్వరలోనే ముదిగుబ్బ పట్టణంలో పెద్ద ఎత్తున రాస్తారోకో కార్యక్రమం నిర్వహిస్తామని వారు అధికారులను హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఆపార్టీ మండల సహాయ కార్యదర్శి తిప్పయ్య తో పాటు, స్థానిక నాయకులు తుమ్మల చిన్నప్ప, రాధాకృష్ణ, శంకర, మంగలి శీన తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు