పడి లేచిన కడలి కెరటం
తెలుగు లోగిలి నుంచి మెరిసిన భారత క్రీడా మాణిక్యం
జపాన్ ఓపెన్ సూపర్ 750 విజేతగా నిలిచిన సింధు
క్రీడలు: రెండు ఒలింపిక్ పతకాలు…బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో బంగారు పతకం…నాలుగేళ్లుగా విజయం కోసం పడిన కష్టం…నేడు జపాన్ ఓపెన్ సూపర్ 750 విజేతగా నిలిచిన వైనం. భారత క్రీడా మాణిక్యం పీవీ సింధుకే సొంతం. విదేశీ గడ్డపై భారత క్రీడా ఖ్యాతిని మరొక్క సారి ప్రపంచానికి చాటి చెప్పిన తెలుగింట వెలసిన క్రీడా కుసుమం సింధు. ఇంతవరకూ ఏ మహిళా షట్లరూ సాధించలేని ఘనత ఆమె సాధించారు. దేశ, విదేశాల ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్న స్టార్ షట్లర్ మన సింధు విజయ గాధ గురించి తెలుసుకుందాం…
భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఆమె అరుదైన ఘనత సాధించింది. తన కెరీర్లోనే కాకుండా, ఇంత వరకు ఎవరు కూడా జపాన్ ఓపెన్ ఫైనల్లో గెలిచి టైటిల్‌ను అందుకోలేదు. ఇపðడామె సాధించింది. విజయాలు ఊరికే రావు…స్వేదం చిందించాలి, కఠోర సాధన గావించాలి, పట్టుదలతో ముందుకు సాగాలి…అప్పుడే విజయాలు వరిస్తాయి. ఇది నిరూపించింది మన సింధు. ఓ మేజర్ టైటిల్‌ను నెగ్గి దాదాపు నాలుగేళ్లు అవుతోంది. గాయాలతో సతమతమై…ఓ దశలో ఆటకు దూరమవుతానేమో అన్నంతగా కుంగిపోయింది. ఫీనిక్స్ పక్షిలా ఓటములనే మెట్లుగా చేసుకుని విజయ బావుటా ఎగరవేసింది. జపాన్‌లో మువ్వన్నెల జెండాను కపðకుని విక్టరీ వేదికపై నిలబడింది…దేశ ఖ్యాతిని నిలబెట్టింది.
ఓటములే గెలుపు సోపానాలుగా…
చివరిసారిగా 2022లో స్విస్ ఓపెన్ సూపర్ 300 ఛాంపియన్ కావడమే ఈ నాలుగేళ్లలో అతిగొప్ప విజయం. 2024లో సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టోర్నీ విజేతగా నిలిచిన సింధు. ఇది అంత పెద్ద టోర్నమెంట్‌గా పరిగణించలేదు. ఆ తరువాత జరిగిన అనేక టోర్నమెంట్లలో ఓటమి చవిచూసింది. ఆస్రేట్లియన్ ఓపెన్, థాయ్‌లాండ్ ఓపెన్, కెనడా ఓపెన్…ఇలా ప్రతి దాంట్లోనూ ఓటమే ఎదురైంది. ఒకదశలో సైనా నెహ్వాల్ మాదిరిగా సింధు కూడా ఆటకు దూరమవుతుందేమోనని అంతా భావించారు. అయితే ఆమె ఈ ఓటములకు కుంగిపోలేదు. ఎంత కిందకు పడితే…అంత పైకి ఉవ్వెత్తున వస్తానని ఆమె పడిలేచిన కెరటంలా ఆటతో మరోసారి నిరూపించింది. ఎదురై ఓటములకు కుంగిపోకుండా…ఎన్నో గెలిచానులే అని సరిపెట్టుకోకుండా…తాను సాధించాల్సింది చాలా ఉందని ఇపðడీ విజయంతో నిరూపించింది సింధు.
జపాన్ లో సాగిన జైత్ర యాత్ర…
జపాన్ ఓపెన్ 750ను కైవసం చేసుకున్న పీవీ సింధు…క్వారటర్ ఫైనల్‌కు ముందే ఒకుహర వైదొలగడం, సెమీస్ మ్యాచ్‌లో యుఫీయ్ మధ్యలోనే అర్థంతరంగా నిష్రక్కమించడంతో సింధు ఫైనల్‌కు తేలికగానే వచ్చిందని కొందరు భావించారు. కానీ, అంతకుముందు ఆమె ప్రతి మ్యాచ్‌లోనూ టాప్ ప్లేయర్లపై ఆధిపత్యం ప్రదర్శించింది. ఫైనల్లో యమగుచి ఎదురు కావడంతో మరోసారి ఫలితం ఎలా ఉంటుందోనని కాస్త టెన్షన్ కలిగింది అభిమానుల్లో. కానీ, తొలి పాయింట్ నుంచే ప్రత్యర్థిపై సింధు ఆధిపత్యం ప్రదర్శించింది. పోటీలోకి వస్తుందని అనిపించిప్పుడల్లా యమగుచిని వెనక్కి నెడుతూ ముందుకు సాగింది, నెగ్గుకొచ్చింది.


