Homeజిల్లాలుఅనంతపురంవేసవి తాపం నుండి ఉపశమనానికి చలివేంద్రం

వేసవి తాపం నుండి ఉపశమనానికి చలివేంద్రం

- Advertisement -

విశాలాంధ్ర -రాప్తాడు : వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని లబ్ధిదారులు, ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఎంపీడీఓ బి.విజయలక్ష్మి చేతులమీదుగా బుధవారం రాప్తాడు ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో బుధవారం చలివేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. పెరుగుతున్న ఎండల దృష్ట్యా కార్యాలయానికి వచ్చే ప్రజలకు, బాటసారులకు తాగునీటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఒక్కరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. అర్జీదారులకు, పరిసర ప్రాంతాల వారికి ఈ చలివేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ భానురేఖ, సీనియర్ అసిస్టెంట్ ​హరిప్రియ, జూనియర్ అసిస్టెంట్ ​నరేష్, డ్వామా, జి.ఎస్.డబ్ల్యూ.ఎస్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు