Homeజాతీయంఉత్కంఠకు తెర.. టీవీకేకు వీసీకే మద్దతు

ఉత్కంఠకు తెర.. టీవీకేకు వీసీకే మద్దతు

- Advertisement -

తమిళనాడులో విజయ్‌ ప్రభుత్వాన్ని ఎప్పుడు ఏర్పాటుచేస్తారనే ఉత్కంఠకు తెరపడినట్లే కనిపిస్తోంది. నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK)  ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్‌ను ఎట్టకేలకు చేరుకుంది. కీలక పరిణామంలో, విదుతలై చిరుతైగల్ కచ్చి (VCK) పార్టీ టీవీకేకు తన మద్దతును ప్రకటించింది. శనివారం మధ్యాహ్నం వీసీకే అధినేత తిరుమావళవన్ తన పార్టీ మద్దతును విజయ్‌కు తెలుపుతూ అధికారిక లేఖను అందజేశారు. ఇప్పటికే కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీలు టీవీకేకు మద్దతు ప్రకటించగా, ఇప్పుడు వీసీకే కూడా తోడవడంతో విజయ్ బలం మెజారిటీ మార్కును (118) దాటింది. దీంతో తమిళనాడులో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది.

గవర్నర్‌తో విజయ్ భేటీ..
అవసరమైన బలం సమకూరడంతో, విజయ్ నేడు నాలుగోసారి లోక్‌భవన్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కలవనున్నారు. తన వద్ద ఉన్న ఎమ్మెల్యేల మద్దతు లేఖలను గవర్నర్‌కు సమర్పించి, ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరనున్నారు. మే 10వ తేదీతో ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగియనుండటంతో, అంతకంటే ముందే కొత్త ప్రభుత్వం కొలువుదీరాల్సి ఉంది. గవర్నర్ నుంచి అనుమతి లభించిన వెంటనే, చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీని కోసం ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. దశాబ్దాల కాలంగా డీఎంకే, ఏఐఏడీఎంకేల మధ్యే సాగుతున్న తమిళ రాజకీయాల్లో విజయ్ రాక ఒక కొత్త శకానికి నాంది పలకబోతోంది. విజయ్ ముఖ్యమంత్రి కాబోతున్నారనే వార్తతో తమిళనాడు వ్యాప్తంగా ఆయన అభిమానులు, టీవీకే కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు