గాయత్రి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు లక్ష్మీపతి
విశాలాంధ్ర ధర్మవరం;; క్రమశిక్షణతో కూడిన విద్య మంచి భవిష్యత్తుకు పునాది అవుతుందని శ్రీ గాయత్రీ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు లక్ష్మీపతి, రిటైర్డ్ టీచర్ జయసింహ, రాఘవేంద్ర తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని చెన్నకేశవ స్వామి దేవాలయంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల వేడుకల్లో సందర్భంగా గాయత్రి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్, నాట్య ప్రదర్శనలో గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన విద్యార్థులను అభినందన సభ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా పట్టణంలోని ఎస్బిఐ కాలనీలో టీచర్ కిషోర్ కుమార్తె ఎంబి భవ్య ఇంటర్మీడియట్ లో 928 మార్కులతో మంచి ప్రతిభ కనపరచడం జరిగింది. ఇందులో భాగంగానే పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో శ్రీ లలితా నాట్య కళానికేతన్ వ్యవస్థాపకులు బాబు బాలాజీ కుమార్తె రామలాలిత్య హైదరాబాదులోని గచ్చిబౌలి స్టేడియం లో 4,000 మందితో సామూహిక నాట్య ప్రదర్శన చేసినందుకుగాను వారు గిన్నిస్ బుక్ రికార్డును కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా భవ్య, రామ లాలిత్యను వేదిక యందు సత్కరిస్తూ జ్ఞాపిక ను గాయత్రి బ్రాహ్మణ సంఘం వారు అందజేశారు. ఈ సందర్భంగా గాయత్రి బ్రాహ్మణ సంఘం వారు మాట్లాడుతూ బ్రాహ్మణులలో మంచిపట్టు, శ్రద్ధ, అకుంఠిత దీక్ష ఉన్నప్పుడే చదువులో సాధ్యపడుతుందని తెలిపారు. బ్రాహ్మణ విద్యార్థులను ఉత్సాహపరిచేందుకే ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. బ్రాహ్మణుల తల్లిదండ్రులు కూడా చదువు పట్ల మంచి ఆసక్తిని తమ పిల్లల పట్ల చూపాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీబిఎస్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మారుతీ రావు, ప్రసాద్, శివ, రామారావు, ప్రణవ సాయి స్కూల్ కిషోర్, నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
క్రమశిక్షణతో కూడిన విద్య మంచి భవిష్యత్తుకు పునాది అవుతుంది..
RELATED ARTICLES