Thursday, April 3, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిక్రమశిక్షణతో కూడినటువంటి విద్య జీవితంలో మంచి గుర్తింపు లభిస్తుంది..

క్రమశిక్షణతో కూడినటువంటి విద్య జీవితంలో మంచి గుర్తింపు లభిస్తుంది..

పట్టణ ప్రముఖులు సంధా రాఘవ, ఎంఈఓ – రాజేశ్వరి దేవి, గోపాల్ నాయక్
విశాలాంధ్ర ధర్మవరం;; క్రమశిక్షణతో కూడినటువంటి విద్య జీవితంలో మంచి గుర్తింపు లభిస్తుందని పట్టణ ప్రముఖులు సంధా రాఘవ, ఎంఈఓ లు రాజేశ్వరి దేవి, గోపాల్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని పుట్టపర్తి రోడ్ సాయి నగర్ లో గల షిరిడి సాయిబాబా కళ్యాణ మండపంలో శ్రీ సాయి విక్టరీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 14వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తల్లిదండ్రులు బాల బాలికలు అని తేడా లేకుండా అందరినీ చదివించాలని, ప్రభుత్వము కూడా విద్య విషయంలో అనేక సంక్షేమ పథకాలను అందిస్తోందని తెలిపారు. క్రమశిక్షణ, తపన, లక్ష్యం లాంటి వాటిని ప్రతి విద్యార్థి లక్ష్యంగా చేసుకోవాలని తెలిపారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఉన్నత స్థాయి వరకు చదివించేలా కంకణం కట్టుకోవాలని అన్నారు. అంతేకాకుండా నేటి విద్యార్థులు టీవీలకు సెల్ ఫోన్ లకు బానిస కాకుండా, చదువు అనే వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని, చదువును కూడా తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ప్రోత్సహించినప్పుడే ఆ కుటుంబంలోని పిల్లలు చక్కటి భవిష్యత్తుకు పోయేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. తదుపరి విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. తదుపరి సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రతిభ పిల్లలకు బహుమతులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ కొండన్న, డైరెక్టర్ రాఘవేంద్ర, కర్రీస్పాండెంట్ జనార్ధన్, పాఠశాల ఉపాధ్యాయులు, పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు