అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలో ఏడాది నుండీ జరిగిన 33 దొంగతనాలలో రికవరీలు చూపిన పోలీసులు జిల్లా ఎస్పీ డి. జగదీష్ విశాలాంధ్ర అనంతపురం నలుగురు అంతర్ జిల్లా దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ డి. జగదీష్ పేర్కొన్నారు. గురువారం స్థానిక పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
- అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలో ఏడాది నుండీ జరిగిన 33 దొంగతనాలలో రికవరీలు చేయడం జరిగిందన్నారు.
అరెస్టు అయిన నిందితుల వివరాలు
1 ) రాఘవేంద్ర, నూతిమడుగు గ్రామం, కంబదూరు మండలం
2) చిరంజీవి, రాంపురం గ్రామం, కంబదూరు మండలం
3) పరందామ, రాంపురం గ్రామం, కంబదూరు మండలం
4) ఎర్రిస్వామి, నుతిమడుగు గ్రామం, కంబదూరు మండలం.
పరారీలో ఉన్న నిందితులు వాసు, తిప్పేపల్లి గ్రామం, కంబదూరు మండలం వన్నూరుస్వామి @ జానీ వెంకటంపపల్లి అని తెలియజేశారు. వారి వద్ద నుంచి
విద్యుత్ ట్రాన్సుఫార్మర్లకు సంబంధించిన 450 కిలోల రాగివైర్లు, 180 కిలోల అల్యుమినియం వైర్లు చేసుకోవడం జరిగిందన్నారు. ఈనేపథ్యంలో అనంతపురం అడిషనల్ ఎస్ పి డి. వి .రమణ మూర్తి పర్యవేక్షణ లో, అనంతపురము సిసిఎస్ సి.ఐ లు ఇస్మాయిల్, జైపాల్ రెడ్డి మరియు అనంతపురం రూరల్ సి.ఐ శేఖర్, రూరల్ ఎస్‌ఐ రామ్ బాబు ల ఆధ్వర్యంలో ప్రత్యేక నిఘా వేశారు. పక్కారాబడిన సమాచారంతో ఈ సి.ఐ ల ఆధ్వర్యంలో సిసిఎస్ హెడ్ కానిస్టేబుళ్లు మల్లికార్జున, చంద్రశేఖర్, శ్రీధర్ ఫణి, శ్రీనివాసులు, నరసింహులు, వెంగప్ప… కానిస్టేబుళ్లు రంజిత్ కుమార్, బాలకృష్ణ, షామీర్ లు మరియు అనంతపురం రూరల్ హెడ్ కానిస్టేబుళ్లు గిరిబాబు, ప్రసాద్, కానిస్టేబుళ్లు రాజు, శివయ్య, ప్రసాద్, పాండవ, అనిల్ కుమార్ లు ప్రత్యేక బృందంగా ఏర్పడి స్థానిక కక్కలపల్లి సమీపంలోని ఓ గుడిసెలో దాచిన రాగి, అల్యుమినియం వైర్లను స్వాధీనం చేసుకున్నారు. రైతులను ఇబ్బందిపెడుతున్న ఈ అంతర్ జిల్లా దొంగల ముఠాను చాకచక్యంగా పట్టుకున్న అనంతపురం సిసిఎస్ సి.ఐ ఇస్మాయిల్ మరియు అనంతపురం రూరల్ సి.ఐ శేఖర్, రూరల్ ఎస్‌ఐ రామ్ బాబు ల బృందాలను జిల్లా ఎస్పీ పి.జగదీష్ అభినందించారు.