విశాలాంధ్ర -తనకల్లు : మండల పరిధిలోని పెద్దపల్లి గ్రామానికి చెందిన ముక్తియార్ భాష జన్మదిన వేడుకలు ఆపన్నులు, బంధువులు,గ్రామప్రజల మధ్య ఘనంగా జరిగాయి. కేక్ కట్ చేసి పలువురికి పంచి గ్రామ ప్రజలతో పాటు స్నేహితులకు విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ ప్రస్తుతం ఆయన సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్ మెంబర్గా కొనసాగుతూ తన గ్రామ ప్రజలకే కాక మండలంలో ఎవరికి ఆపద వచ్చినా ఆపన్న హస్తం అందిస్తూ తను పుట్టి పెరిగిన ఊరికే కాక నియోజకవర్గంలో ఉండే యువత కోసం మహిళల కోసం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఆలోచనలతో ముందుకు వెళ్తున్నట్టు తెలిపారు. మండలంలోని పలువురు స్నేహితులు ఆయన కలిసి దుశ్యాలువాతో పూలమాలలు వేసి సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముక్తియార్ భాష యువసేన సభ్యులు చంద్ర సూరి రవి నాయక్ మాజీ ఎంపిటిసి రమణ బ్రహ్మానందరెడ్డి మాజీ సర్పంచ్ శివరాం స్నేహితులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు