విశాలాంధ్ర -నందిగామ: అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని ప్రభుత్వ కార్యక్రమం గా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టడం తో దానికి కృతజ్ఞత భావంతో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్ ఆదేశాల అనుసారం బుధవారం స్థానిక గాంధీ సెంటర్లో ఘనంగా పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు నందిగామ ఆర్యవైశ్య సంఘం నాయకులు పారేపల్లి సాయిబాబు ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు ఆయన జయంతి 12 నెలల పాటు ప్రతినెలా 16వ తేదీన జరపనున్నట్లు తెలియజేశారు పాదచారులకు మజ్జిగ ప్యాకెట్లు,శీతల పానీయాలు, పుచ్చకాయ ముక్కలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో నందిగామ ఆర్యవైశ్య సంఘం నాయకులు సముద్రాలు శ్రీనివాసరావు, పరిసే మల్లికార్జునరావు, పులిపాటి సత్యం,నాగరాజు తదితరులు పాల్గొన్నారు
అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఘన నివాళి….
RELATED ARTICLES