విశాలాంధ్ర ధర్మవరం: శ్రీ సత్య సాయి జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా మాసపల్లి సాయికుమార్ వైసిపి నాయకులు సత్కరించారు. మాసపల్లి సాయికుమార్ స్వగృహంలో నందు మున్సిపల్ వింగ్ జిల్లా అధ్యక్షునిగా గజ్జల శివ, వైసిపి కౌన్సిలర్లు చింత ఎల్లయ్య, కాలంగి శ్రీనివాసులు కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం మాసపల్లి సాయికుమార్ పుష్పగుచ్చం అందజేసి దుశ్యాలతో సన్మానించారు. గజ్జల శివ, చింత ఎల్లయ్య, కాలంగి శ్రీనివాసులు మాట్లాడుతూ.. మా మిత్రుడు మాసపల్లి సాయికుమార్ వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించినందుకు సంతోషకరంగా ఉందన్నారు. ఇలాగే దినదినాభివృద్ధి చెంది మరెన్నో పదవులకు అదగమించాలని కోరుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా మాసపల్లి సాయికుమార్ మాట్లాడుతూ.. నా మిత్రులు శుక్రవారం నా స్వగృహానికి వచ్చి సన్మానించి శుభాకాంక్షలు తెలిపినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. నాపై నమ్మకంతో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు ఉష శ్రీ చరణ్ సత్యసాయి జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో గజ్జల శివ, చింత ఎల్లయ్య, కాలంగి శ్రీనివాసులు, ఓం, దాము,కుమార్,శివ తదితరులు పాల్గొన్నారు.
మాసపల్లి సాయికుమార్ కి ఘన సన్మానం
RELATED ARTICLES