Wednesday, March 12, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిహక్కులను, చట్టాలను మహిళలందరూ సద్వినియోగం చేసుకున్నప్పుడే సుఖవంతమైన జీవితం

హక్కులను, చట్టాలను మహిళలందరూ సద్వినియోగం చేసుకున్నప్పుడే సుఖవంతమైన జీవితం

లాయర్ సుమలత, ఆర్డిటి-ఏటిఎల్ శ్రీనివాసులు
విశాలాంధ్ర ధర్మవరం; మహిళల యొక్క హక్కులను, చట్టాలను మహిళలందరూ సద్వినియోగం చేసుకున్నప్పుడే సుఖవంతమైన జీవితంలో లభిస్తుందని లాయర్ సుమలత, ఆర్ డి టి ఏ టి ఎల్ శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఎన్జీవో హోములో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వారు విచ్చేశారు. ఈ కార్యక్రమం ధర్మవరం మండలంలోని ఓబుల నాయన పల్లి గ్రామ క్లస్టర్ ఆధ్వర్యంలో 90 సంఘాలు, 29 గ్రామ మహిళల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు. తొలుత పట్టణంలోని పలు కూడలిలో ఫ్లెక్సీ చేత పట్టుకొని మహిళల యొక్క హక్కులు వాటి చట్టాలపై ర్యాలీ నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం లాయర్ సుమలత, ఆర్ డి టి ఎ టి ఎల్ శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హక్కులను, చట్టాలను దుర్వినియోగం చేయకుండా సమాజానికి కుటుంబానికి ఉపయోగించుకోవాలని తెలిపారు. అప్పుడే మహిళలకు మంచి గుర్తింపు లభిస్తుందని తెలిపారు. అంతేకాకుండా దేశము, రాష్ట్రములలో మహిళలపై దాడులను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ దాడులను ఎదుర్కోవాలంటే ప్రతి మహిళ ఝాన్సీ లక్ష్మీబాయిల ఎదగాలని తెలిపారు. హక్కులను కాపాడుకొనుట అభివృద్ధి బాటలో నడవటం లాంటి పలు అంశాలను మహిళలకు తెలియజేయడం జరిగిందని తెలిపారు. మహిళలు వివక్షతతో కూడినటువంటి వాటిని తగ్గించుకోవాలని, కుటుంబములో ఆడా మగా అనే తేడా లేకుండా అందరినీ సమానంగా చూడాలని, కుటుంబ పనులలో కూడా తేడా ఉండరాదని వారు సూచించారు. తదుపరి ఆర్ డి టి సంస్థ చేస్తున్న పలు సేవా కార్యక్రమాలను కూడా వివరించడం జరిగిందని, పేదల పాలిట కల్పతరువు ఆర్డిటిసంస్థ అని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఓబులాయన పల్లి మహిళలు, పురుషులు, ఆర్ డి టి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు