డి యం హెచ్ ఓ.డా ఈ బి దేవి
విశాలాంధ్ర -అనంతపురం : ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆద్వర్యం లో సోమవారం నిర్వహించిన ర్యాలీ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా ఈ బి దేవి జెండా ఊపి ప్రారంభించారు. .ఈర్యాలీ వైద్య శాఖ కార్యాలయం నుండి తెలుగు తల్లి విగ్రహం వరకు కొనసాగి తిరిగి వైద్య కార్యాలయం ముందు కూడలిలో మానవహారం నిర్వహించారు.
ఈ సందర్భంగా డి యం హెచ్ ఓ డా ఈ బి దేవి మాట్లాడుతూ ఈ సంత్సరం
“”ఆరోగ్య కరమైన ప్రారంభం – ఆశాజనక భవిషత్తు “”అన్న నినాదము తో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య మరియు ఆరోగ్య శాఖ ద్వారా వైద్య సేవా కారక్రమాలు ముఖ్యంగ క్యాన్సర్ , టీ బి , కుష్టు , చెక్కర వ్యాధి , బి పి మొదలగు వ్యాధుల తో పాటు దోమలు ద్వారా వ్యాపించే వ్యాధులు నివారణ మరియు నిర్మూలన కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న దని తెలియజేశారు. మాత మరియు శిశు ఆరోగ్యం కోసం కూడా అనేక కారక్రమాలు నిర్వహిస్తున్నావని తెలిపారు
ఈ క్రమంలో వైద్య మరియు ఆరోగ్య శాఖ లో పనిచేస్తున్న వైద్య సిబ్బంది అంకిత భావంతో పనిచేసి వైద్య సేవలు అందించాలని కోరారు .
ఈ కారక్రమంలో యన్ సి డి ప్రోగ్రాం అధికారి డా నారాయణ స్వామి , జిల్లా మలేరియా అధికారి ఓబులు , డెమో త్యాగరాజ్ , ఆరోగ్య విద్యఅధికారి
గంగాధర్ ,కార్యాలయ ఇతర సిబ్బంది ,ప్రభుత్వ నర్సింగ్ స్కూల్ మరియు కళాశాల సిబ్బంది,విద్యార్థినిలు సచివాలయం ఏయన్ యం లు ,ఆశాకార్యకర్తలు పాల్గొన్నారు .