Sunday, December 22, 2024
Homeఆంధ్రప్రదేశ్ప్రభుత్వ ఆసుపత్రికి టోల్ కిట్టు ప్రదానం

ప్రభుత్వ ఆసుపత్రికి టోల్ కిట్టు ప్రదానం

చైర్మన్ తల్లం నారాయణమూర్తి
విశాలాంధ్ర ధర్మవరం;;పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి టోల్ కిట్టును(విలువ 5000 రూ .లు)పట్టణంలోని మానవతా స్వచ్ఛంద సంస్థ కమిటీ వారు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉదయ్ భాస్కర్ కు చైర్మన్ తల్లం నారాయణమూర్తి, కార్యదర్శి మంజునాథ్ అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్, కార్యదర్శి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలోని వార్డులకు, వివిధ మరమ్మత్తులకు, వివిధ రూపాలలో ఈ టూల్ కిట్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. మున్ముందు ప్రభుత్వ ఆసుపత్రికి మరిన్ని సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. అనంతరం ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ .మాధవి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉదయ్ కుమార్ స్వచ్ఛంద సేవా సంస్థ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు పెద్దకోట్ల రవికుమార్, గట్టు వెంకటేశులు, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు