జిల్లా ప్రధాన కార్యదర్శి సకల రాజా
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని ఐటిఐ కళాశాలలో ఏఐవైఎఫ్ 66వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఏఐవైఎఫ్ ధర్మవరం తాలూకా కార్యదర్శి గోవర్ధన్ అధ్యక్షత వహించగా, ముఖ్యఅతిథిగా మాజీ ఏఐవైఎఫ్ నాయకులు మురళి గౌడ్, చేతులమీదుగా పతాక ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మురళి గౌడ్, సత్య సాయి జిల్లా ప్రధాన కార్యదర్శి సకల రాజా మాట్లాడుతూ 1959 మే 3న ఆవిర్భవించి యువత హక్కుల కోసం నిరుద్యోగ సమస్యలు తీర్చడానికి సమ సమాజ స్థాపనకై నిరంతరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్న అఖిలభారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) కృషి చేస్తున్నది అని తెలిపారు. బెంగా చట్టాన్ని అమలు చేయాలని. ప్రైవేట్ సెక్టార్లలో రిజర్వేషన్స్ అమలు చేయాలని. మతసామరస్యాన్ని కాపాడడం అందరి బాధ్యత అని తెలియజేశారు. దేశవ్యాప్తంగా ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని ఎమ్మెస్ఎంఈ కంపెనీలు ఏర్పాటు చేస్తూ స్థానిక నిరుద్యోగులకే అవకాశం ఇవ్వాలని తెలిపారు. కల్తీ ఆహార పదార్థాలను నిలువరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందిందని, రాష్ట్రవ్యాప్తంగా బెట్టింగ్ గంజాయి మాదక ద్రవ్యాల అసాంఘిక శక్తులు రెచ్చిపోతున్న ప్రభుత్వం కట్టడం చేయడంలో పూర్తిగా విఫలం చెందిందని అన్నారు.
ఎన్నికల హామీల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ యువతీ యువకులకు నిరుద్యోగ భృతి పథకం ద్వారా ప్రతినెల తగినంత నిధులను అందించి ఆదుకుంటామని హామీ ఇచ్చి ఇప్పటివరకు 11 నెలలు అవుతున్న ప్రభుత్వం ఎక్కడ ఉసేతకోపోవడం దుర్మార్గం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు లోకనాథ్, హరి, ప్రసాద్, మన్సూర్, సునీల్ తదితరులు పాల్గొన్నారు
ఘనంగా ఏఐవైఎఫ్ 66వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..
RELATED ARTICLES