Tuesday, April 1, 2025
Homeజాతీయంబెట్టింగ్ యాప్స్ వ్య‌వ‌హారంలో కీల‌క ప‌రిణామం

బెట్టింగ్ యాప్స్ వ్య‌వ‌హారంలో కీల‌క ప‌రిణామం

బెట్టింగ్ యాప్స్ వ్య‌వ‌హారంలో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేసింది. సిట్‌ను ఏర్పాటు చేస్తూ డీజీపీ జితేంద‌ర్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. సిట్ ప్ర‌ధాన అధికారిగా ఐజీ ర‌మేశ్‌ను నియ‌మించారు. ఇందులో స‌భ్యులుగా ఎస్‌పీలు సింధు శ‌ర్మ‌, వెంక‌ట‌ల‌క్ష్మి, అద‌నపు ఎస్‌పీలు చంద్ర‌కాంత్‌, శంక‌ర్ ఉన్నారు. ఇక బెట్టింగ్ యాప్స్ వ్య‌వ‌హారంలో ఇప్ప‌టికే పంజాగుట్ట‌తో పాటు సైబ‌రాబాద్‌, మియాపూర్ పోలీస్ స్టేష‌న్ల‌లో 25 మంది సెల‌బ్రిటీల‌పై కేసులు న‌మోద‌య్యాయి. ఈ అంశాన్ని సీరియ‌స్‌గా తీసుకున్న ప్ర‌భుత్వం ఇప్పుడు సిట్‌ను ఏర్పాటు చేస్తూ ఉత్త‌ర్వులు ఇచ్చింది. దీనిపై నెల‌న్న‌ర రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాల‌ని డీజీపీ జితేంద‌ర్… సిట్‌ను ఆదేశించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు