Homeఆంధ్రప్రదేశ్పాలమూరు ఎత్తిపోతల పథకంలో కీలక ముందడుగు.. రెండు భారీ మోటార్లు ఆన్

పాలమూరు ఎత్తిపోతల పథకంలో కీలక ముందడుగు.. రెండు భారీ మోటార్లు ఆన్

- Advertisement -

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నార్లాపూర్‌-అంజనగిరి జలాశయం మొదటి లిఫ్టు వద్ద రెండు భారీ మోటార్లను ఎట్టకేలకు ప్రారంభించారు.
నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం అంజనగిరి వద్ద బుధవారం రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ మోటార్లను స్విచ్‌ ఆన్‌ చేసి కృష్ణా జలాల ఎత్తిపోతలను ప్రారంభించారు.ముందుగా పూజలు నిర్వహించిన అనంతరం రెండో మోటార్‌ను, ఆ తర్వాత మొదటి మోటార్‌ను ఆన్‌ చేశారు.
దీంతో కృష్ణానది నుంచి నీటిని నార్లాపూర్‌-అంజనగిరి జలాశయంలోకి ఎత్తిపోశారు.

ఒక్కో మోటార్‌ సెకనుకు మూడు వేల క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసే సామర్థ్యం
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. జలాశయంలో ఆరు టీఎంసీల నీటిని నిల్వ చేసి, మిషన్‌ భగీరథ ద్వారా తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలిపారు.పాలమూరు జలాశయానికి ఏర్పాటు చేసిన తూము ద్వారా పక్కనే ఉన్న మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మొదటి లిఫ్టు పరిధిలోని ఎల్లూరు జలాశయానికి నీటిని తరలించి, అచ్చంపేట, కల్వకుర్తి ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.సాగునీటిపారుదల శాఖ చీఫ్‌ ఇంజినీర్‌ పార్థసారథి, ఇన్‌ఛార్జి సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌ రవీందర్‌ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టులోని ఒక్కో మోటార్‌ సెకనుకు మూడు వేల క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసే సామర్థ్యం కలిగి ఉందని వివరించారు.

ఒక్కో మోటార్‌ సెకనుకు మూడు వేల క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసే సామర్థ్యం
ప్రస్తుతం అంజనగిరి జలాశయంలో 3.8 టీఎంసీల నీరు నిల్వ ఉందని తెలిపారు.కృష్ణానది నుంచి నీటిని ఎత్తిపోస్తూ కేవలం నాలుగు రోజుల్లోనే జలాశయాన్ని ఆరు టీఎంసీల సామర్థ్యం మేరకు నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో పాటు ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు లోకిలాల్‌, అమర్‌సింగ్‌, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.

గ్రిడ్‌లో లోఫ్రీక్వెన్సీతో నిలిచిన మోటార్లు
అంజనగిరి జలాశయం వద్ద బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు నీటి ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి.అయితే సాయంత్రం 5 గంటల సమయంలో విద్యుత్‌ పవర్‌ గ్రిడ్‌లో ఫ్రీక్వెన్సీ తగ్గినట్లు ఇంజినీర్లు గుర్తించారు.ఫ్రీక్వెన్సీ 49.8 నుంచి 48కు పడిపోవడంతో మోటార్లను నిలిపివేశారు.విద్యుత్‌ సరఫరాలో తలెత్తిన ఈ సమస్యను పరిష్కరించేందుకు ఇంజినీర్ల బృందం సుమారు నాలుగున్నర గంటల పాటు శ్రమించింది.చివరికి రాత్రి 9.29 గంటలకు మొదటి మోటార్‌ను మళ్లీ ఆన్‌ చేసి నీటి ఎత్తిపోతలను పునఃప్రారంభించారు.రెండో మోటార్‌ను తిరిగి నడిపించేందుకు కూడా అధికారులు ప్రయత్నాలు కొనసాగించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు