- Advertisement -
రష్యాను భారీ భూకంపం వణికించింది. రష్యా తీరంలోని కంచట్కా ద్వీపకల్పంలోని పెట్రోపావ్లోవ్స్క్ తూర్పు దిశగా 136 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రతను 8.7గా గుర్తించారు. ప్రపంచంలోనే ఈ స్థాయిలో భూకంపం రావడం 2011 తర్వాత మళ్లీ ఇదే తొలిసారి అని చెబుతున్నారు. ఈ భూకంపం నేపథ్యంలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఈ హెచ్చరికలు చేసిన కొద్దిసేపటికే రష్యా, జపాన్ను సునామీ తాకింది.


