అధికారుల తీరుతో మసకబారుతున్న ప్రజా సమస్యల పరిస్కార వేదిక
విశాలాంధ్ర -వలేటివారిపాలెం : వలేటివారిపాలెం మండలంలోని మండలపరిషత్ కార్యాలయంలోని సమావేశమందిరంలో సోమవారం ప్రజా సమస్య ల పరిస్కారవేదిక నిర్వహించారు.పరిస్కార వేదికలో 12 గంటల సమయానికి తహసీల్దార్ అబ్దుల్ అమీద్, మండలసర్వేయర్ గోపిరెడ్డి, ఉపాధిహామీ పథకం ఏపీఓ ఉమామహేష్, అంగన్వాడీ సూపర్వైజర్ సునీత, ఆర్ డబ్యూ ఎస్ ఏఈ శిరీష, వెలుగు సీ సీ కుమారి మాత్రమే హాజరైనారు.కొంతమంది అధికారులు మాత్రం సంతకం చేసి వెళ్లిపోయారని తహసీల్దార్ తెలిపారు ప్రభుత్వాలు బాహాటంగా ప్రజా పరిస్కార వేదికను ప్రారంభించిన క్షేత్ర స్థాయిలో మాత్రం అధికారులు డుమ్మా కొడుతూ ఉన్నారు ప్రజలు తమ సమస్యలు విన్నవించుకొనేందుకు వచ్చినా సంబంధిత అధికారులు అందుబాటులో లేకపోవడంతోప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అర్జీలు ఎన్ని సార్లు ఇచ్చినప్పటికి పరిష్కారం కావడం లేదంటూ అసలు అర్జీలు ఇవ్వడమే మానేశామని ప్రజలు అంటున్నారు.ఇప్పటికైనా సంబంధిత జిల్లా అధికారులు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని అన్ని శాఖల అధికారులు పాల్గొనేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.