Homeఆంధ్రప్రదేశ్తుఫాను పై సమీక్ష

తుఫాను పై సమీక్ష

- Advertisement -

ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి.
మండల అధికారులు తుఫాను పై సమీక్ష సమావేశం.


విశాలాంధ్ర – అనపర్తి : అనపర్తి మండల ప్రజలంతా అధికారులు సలహాలు సూచనలు పాటించాలని, రాబోయే తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండాలని అనపర్తి మండలం అభివృద్ధి అధికారి మండ రామకృష్ణారెడ్డి తెలిపారు.ఈ నెల 27 28 29 తేదీలలో తుఫాను ముప్పు పొంచి ఉండటంతో అనపర్తి మండల అధికారులు ముందస్తుగా ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. అనపర్తి ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో మండ రామకృష్ణారెడ్డి, తహసిల్దార్ అనిల్, ప్రత్యేక అధికారి నాగ లత, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి లు మండలంలోని అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మొంథ తుఫాన్ నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారుల ఆదేశానుసారం 27, 28, 29 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర గాలులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే మూడు రోజుల్లో ప్రజలకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పంచాయతీ కార్యదర్శులు గ్రామ రెవెన్యూ అధికారులు, సచివాలయ సిబ్బంది ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యల కోసం సిద్ధంగా ఉండాలని తెలిపారు. విద్యుత్, రోడ్లు, తాగునీరు వంటి అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవడానికి సంబంధిత శాఖలను సన్నద్ధం చేయాలని ఆయన అన్నారు. తహసీల్దార్ అనిల్ మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు సిద్ధం చేయాలని చెప్పారు. నిరంతర పర్యవేక్షణ మరియు ప్రజలకు విజ్ఞప్తి మొంథా తుఫాను తీరాన్ని దాటే ప్రక్రియ పూర్తయ్యే వరకు క్షేత్ర స్థాయిలో పరిస్థితిని నిరంతరంగా పర్యవేక్షించాలని, ఎప్పటికప్పుడు గ్రామ రెవెన్యూ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయం సిబ్బంది సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. డివిజనల్ పంచాయతీ అధికారి నాగ లత మాట్లాడుతూ ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలు కూడా అధికారుల సూచనలను తప్పక పాటించాలని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, అనవసర ప్రయాణాలు మానుకోవాలని తెలిపారు. పెద్ద పెద్ద చెట్లు క్రింద, బహిరంగ ప్రదేశాలలో పశువులను కట్టొద్దని హెచ్చరించారు. గ్రామాలలో ఫ్లెక్స్, ఇతర హోల్డింగ్ లు తక్షణం విప్పేయలేని ఆదేశించారు. శిథిలావస్థకు చేరిన బిల్డింగ్ లలో ఈ మూడు రోజులు ఆవాసాలు ఖాళీ చేయాలని తెలిపారు. ట్రైన్లలో పూడికతీతలు ఎప్పటికప్పుడు తీసివేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని రెవెన్యూ, సచివాలయం, వ్యవసాయ, పోలీసు, అగ్నిమాపక తదితర శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు