Wednesday, February 5, 2025
Homeజిల్లాలుఅనంతపురంమెదడువాపు వ్యాధి నివారణపై సమీక్ష

మెదడువాపు వ్యాధి నివారణపై సమీక్ష

విశాలాంధ్ర -అనంతపురం : జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం మలేరియా విభాగం నందు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఈబీదేవి అధ్యక్షతన మెదడు వాపు వ్యాధి నివారణ మరియు నియంత్రణ చర్యలపై మునిసిపల్ అధికారులు మరియు సబ్ యూనిట్ అధికారులతో బుధవారంసమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశము నందు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఈ బి దేవి మాట్లాడుతూ మెదడు వాపు వ్యాధి నియంత్రణకు పంచాయితీ రాజ్, మున్సిపల్ మరియు వైద్య ఆరోగ్యశాఖ కలిసి తగిన దోమ నియంత్రణ చర్యలను చేపట్టడం ద్వారా దోమల వల్ల వచ్చే జబ్బులను నియంత్రించి ప్రజల ఆరోగ్య స్థితిని మెరుగుపరచడానికి కృషి చేయాలని తెలిపారు. జపనీస్ యెన్ సేఫలైటీస్ మెదడు వాపు వ్యాధిని కలిగించే వైరస్ పందులు, కొంగలు, ఇతర పక్షుల శరీరాలలో ఉంటుందని వీటిని కుట్టిన దోమలు మనుషులను కుట్టినట్లయితే మెదడు వాపు వ్యాధి వస్తుందని అందుకు పంచాయతీరాజ్, మునిసిపల్ అధికారులు పందులను ఊరికి దూరంగా మూడు నుంచి ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉండేటట్లు చూడాలని జనావాసాల మధ్యకు వాటిని రాకుండా చూడాలన్నారు. మురికి కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ, మురుగునీరు ఎలాంటి అడ్డంకి లేకుండా ప్రవహించేటట్లు చూడాలని, చెత్తను డంపింగ్ యార్డ్ లకు తరలించాలని పేర్కొన్నారు. మలేరియా సబ్ యూనిట్ అధికారులు పంచాయతీ సెక్రటరీలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు మరియు ఆరోగ్య సిబ్బంది చర్యలను మానిటరింగ్ చేయాలన్నారు. దోమలపై నియంత్రణ చేపట్టి వ్యాధిల పై నిరంతరం నిఘా ఉంచాలని తెలియజేశారు. జిల్లా మలేరియా నివారణ అధికారి ఓబులు మాట్లాడుతూ… పంచాయతీ మరియు మున్సిపల్ అధికారులు కాల్వలలో పెరుకు పోయిన చెత్తను ఎప్పటికప్పుడు తొలగిస్తూ అబేట్, బి టి ఐ పౌడర్, బి టి ఐ లిక్విడ్ వంటి మందులతో దోమల లార్వాలను నియంత్రణ చేసే మందులను మురుగునీటి కాలువలలో స్ప్రే చేయించాలని సూచించారు. అదేవిధంగా వేకెంట్ ల్యాండ్ ఇళ్ల మధ్య ఖాళీ ప్రదేశాలలో పిచ్చి మొక్కలు పెరగకుండా చెత్తాచెదారం పడవేయకుండా ఇళ్ల స్థలాలను పరిశుభ్రంగా ఉంచినట్లు స్థల యజమానులకు నోటీసులు జారీ చేయాలని మునిసిపల్ అధికారులకు సూచించారు. లో లైయింగ్ ఏరియాలను గుర్తించి వాటిలో ఆయిల్ బాల్స్ వేయించడం లేదా వాటిని మట్టితో పూ డిచివేయడం చేయాలని దీనివల్ల పరిసరాలు పరిశుభ్రంగా ఉండి దోమల నియంత్రణను సాధించవచ్చని తెలియజేశారు. ఈ వ్యాధిపై దోమల నియంత్రణను గురించి నిరంతరం ప్రజలకు అవగాహన కల్పించాలని ఆరోగ్య సిబ్బందికి సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మైక్రోబయాలజీ విభాగము అధిపతి డాక్టర్ శాంతిరెడ్డి మాట్లాడుతూ… ప్రైవేటు ఆసుపత్రులలో చేరిన అనుమానిత మెదడువాపు కేసుల సరే బ్రో స్పైనల్ ఫ్లూయిడ్ (సీరం ) సేకరించి మైక్రో బయాలజీ ల్యాబ్ కు వీలైనంత తొందరగా వ్యాధి నిర్ధారణ చేస్తామని తెలియజేశారు. డెంగ్యూ ఎలిసా టెస్ట్ లను కూడా ప్రతిరోజు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మైక్రో బయాలజీ సైంటిస్ట్ డాక్టర్ అనురాధ, ఆరోగ్య విస్తరణ అధికారి గిరిధర్ రెడ్డి, జిల్లాలోని మునిసిపాలిటీల శానిటరీ ఇన్స్పెక్టర్లు, మలేరియా సబ్ యూనిట్ అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు