Sunday, January 19, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఆర్మీ ఉద్యోగికి అశ్రు నివాళులు

ఆర్మీ ఉద్యోగికి అశ్రు నివాళులు

విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని నాగుల బావి వీధి కు చెందిన తలమర్ల వెంకట రమణ రెడ్డి కు అశ్రు నివాళులు పట్టణ ప్రజలతోపాటు వివిధ అధికారులు, పోలీస్ అధికారులు, కేంద్ర బలగాల నడుమ వైభవంగా నిర్వహించారు. మృతుడు తలమర్ల వెంకట రమణారెడ్డి కాశ్మీర్లో విధులలో ఉన్నప్పుడు అనుకోకుండా గుండెపోటుకు గురికావడంతో మృతి చెందడం జరిగింది. మృతదేహాన్ని కాశ్మీర్ నుండి ఢిల్లీకు, ఢిల్లీ నుండి బెంగళూరుకు, బెంగళూరు నుండి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆర్మీ వాహనంలో ధర్మవరానికి శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటలకు కుటుంబ సభ్యుల వద్దకు చేర్చారు. అతి చిన్న వయసులోనే ఇంతటి ఘోరం చూడాల్సి వస్తుందని కుటుంబ సభ్యులు,బంధువులు రోదనలు మిన్నంటాయి. కుటుంబ సభ్యులు మాట్లాడుతూ దేశం కోసం సేవ చేయాలన్న తలంపుతోనే ఆర్మీలో చేరడం జరిగిందని, రిటైర్డ్ అయి వస్తాడన్న ఆశతో ఎదురు చూసామని, కానీ భగవంతుడు మాకు లేకుండా చేశాడన్న దుఃఖాన్ని దిగమింగలేకపోతున్నామని తెలిపారు. అనంతరం వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో పాటు వైఎస్ఆర్సిపి పార్టీ కు సంబంధించిన గుర్రం శ్రీనివాసరెడ్డి, చెందమూరు నారాయణరెడ్డి, బ్రహ్మయ్య, మాసపల్లి సాయికుమార్, పట్టణంలోని వివిధ పోలీస్ స్టేషన్ లోని పోలీస్ సిబ్బంది, అధికారులు, తదితరులు కూడా అక్కడికి చేరుకొని పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. తదుపరి ఇంటి నుండి తన సొంత గ్రామమైన డివిజన్ పరిధిలోని చెన్నై కొత్తపల్లి మండలం బసినేపల్లి గ్రామం వద్దకు శవ పేటికను చేర్చారు. అక్కడ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అధికారులు, గ్రామ పట్టణ ప్రజల నడుమ కేంద్ర బలగాలు లాంచనప్రాయంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో అంత్యక్రియలను నిర్వహించారు. పట్టణం నుండి చెన్నై కొత్తపల్లి వరకు వందలాదిమంది అంత్యక్రియలో భాగంగా ర్యాలీలో పాల్గొని తుది వీడ్కోలను ప్రజలు పలికారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు