విశాలాంధ్ర-విజయనగరం జిల్లా.రాజాం : పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి ఘటనపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ రాజాం పట్టణంలో క్రైస్తవ సంఘాల పాస్టర్స్ ఆధ్వర్యంలో శనివారం శాంతి ర్యాలీ నిర్వహించారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి చెంది చాలా రోజులు అయినప్పటికీ దోషులు ఎవరో గుర్తించకపోవడం విచారకరమన్నారు. పథకం ప్రకారం క్రైస్తవులపై దాడులు చేసేన దోషులను కఠినంగా శిక్షించాలి, క్రైస్తవులకు రక్షణ కల్పించాలని కోరారు.