శ్రీ కోదండ రామస్వామి దేవాలయ అభివృద్ధి కమిటీ
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని రామ్ నగర్ కొత్తపేట లో వెలసిన శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో ఈనెల నాలుగవ తేదీ నుండి ఆరవ తేదీ వరకు శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ వేడుకలను నిర్వహించుట లో భాగంగా ఇంటింటా విరాళము, నిత్యావసర సరుకులను ప్రజలను భాగస్వాములతో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు పామిశెట్టి కృష్ణయ్య, ఉపాధ్యక్షులు చందా రామాంజనేయులు, పూజారి ఆదినారాయణ, కార్యదర్శి రంగన్న వెంకట రమణ తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ తోపాటు సభ్యులు, భక్తాదులు, రాంనగర్, కొత్తపేట, కాలనీ ప్రజలు అందరూ ఇంటింటా కుటుంబాల వద్దకు ప్రజలు ఇచ్చిన నగదు, నిత్యావసర సరుకులను విరాళాలుగా తీసుకోవడం జరుగుతోందని తెలిపారు. గత 26 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే ఆలయ 26వ వార్షికోత్సవమును కూడా ఘనంగా నిర్వహిస్తున్నట్టు వారు తెలిపారు. ఈ సీతారామ కళ్యాణ మహోత్సవ వేడుకలు 4వ తేదీన ప్రజారోహణం, 5వ తేదీన ఎదురుకోళ్ల కార్యక్రమం, 6వ తేదీన కళ్యాణం తో పాటు అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ ఆలయం 30/4/98 వ తేదీన శంకుస్థాపన, 25/4/99 వ తేదీన విగ్రహ ప్రతిష్ట, కల్యాణోత్సవం జరిగిందని తెలిపారు కళ్యాణోత్సవ వేడుకలకు రూ.25,000 లనుండి 100 రూపాయల వరకు విరాళాలు సేకరించడం జరిగిందన్నారు. భక్తాదులు కూడా బెల్లము, బియ్యము, కందిబేలు, శనగబేలు, రవ్వ ,పామాయిల్, పాలు, పెరుగు తదితర నిత్యావసర సరుకులు వారి శక్తి కొలది ఇవ్వడం జరిగిందన్నారు. దాతలు, భక్తాదులు, ఎవరైనా సరే కళ్యాణ మహోత్సవ వేడుకలకు తమకు తోచిన సరుకులు గాని నగదు కానీ ఈనెల ఆరవ తేదీ వరకు ఇవ్వవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో సహాయ కార్యదర్శులు పూజారి లక్ష్మీనారాయణ, పామిశెట్టి చిన్న శ్రీనివాసులు, హరి, రాము, కోశాధికారి రాముడు సహాయ కోశాధికారి హరికృష్ణ, కార్యనిర్వాహక కమిటీ సభ్యులు, గౌరవ సలహా మండలి, ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తాదులు పాల్గొన్నారు.
విరాళాలు, నిత్యావసర సరుకులు ఇంటింటా సేకరణతో కళ్యాణ మహోత్సవ నిర్వహణ…
RELATED ARTICLES