Homeఆంధ్రప్రదేశ్పేద విద్యార్థులకు అన్నపూర్ణ ఆపన్న అస్త్రం ఈ మధ్యాహ్న భోజన పథకం..

పేద విద్యార్థులకు అన్నపూర్ణ ఆపన్న అస్త్రం ఈ మధ్యాహ్న భోజన పథకం..

- Advertisement -

ఆమ్ ఆద్మీపార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ హరికృష్ణ
విశాలాంధ్ర ధర్మవరం;; పేద పిల్లలకు అన్నపూర్ణ ఆపన్న అస్త్రం ఈ మధ్యాహ్న భోజన పథకము అని ఆమ్ ఆద్మీపార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ హరికృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోషల్ మీడియాలో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు మధ్యాహ్న భోజన పథకం మీద చేసిన వ్యాఖ్యలు అభ్యంతరంగా ఉన్నాయని వారు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ పేద, నిరుపేద, మధ్యతరగతి వారి పిల్లల కోసం రూపొందించినదే ఈ మధ్యాహ్న భోజన పథకం అని తెలిపారు. అటువంటి పథకం మీద గరికపాటి నరసింహారావు అభ్యంతర వ్యాఖ్యలు చేయడం దుర్మార్గము అని వారు తెలిపారు. 1960లో మొట్టమొదట తమిళనాడులో మాజీ ముఖ్యమంత్రి కామరాజ్ చే ప్రారంభించబడినది తెలిపారు. అనంతరం 2002 నాటికి భారత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ పథకం అన్ని రాష్ట్రాలలో అమలు చేయబడిన విషయం గరికిపాటి నరసింహారావుకు తెలియదా? అని వారు సూటిగా ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లో 2003 జనవరిలో ఈ మధ్యాహ్న భోజన పథకం మొదటిసారిగా ఒకటవ తరగతి నుండి 5వ తరగతి వరకు విద్యార్థులకు ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. మరి ఈ కార్యక్రమం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అని పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాథమిక ,ఉన్నత, ప్రాథమిక పాఠశాలలు, ప్రభుత్వ సహాయక అంగన్వాడీలు, మదరసాలు, మక్తబ్ లోని పిల్లలకు పని దినాలలో ఉచిత భోజనాన్ని అందిస్తున్నారని తెలిపారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంకా అభివృద్ధి చేయవలసిన ఆవశ్యకత ఎంతో ఉందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ భోజనములో రుచి, సుచి, నాణ్యత తగ్గిన ఉపేక్షించేది లేదని వారు హెచ్చరించారు. ప్రభుత్వం పోషకాహారం బలం పెంచేలా ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత అభివృద్ధి చేయాలి అని తెలిపారు. లీప్ యాప్ ద్వారా ఈ భోజన నాణ్యత పై ప్రభుత్వంకు ఫీడ్బ్యాక్ ఇచ్చే అవకాశం ఉందని తెలిపారు. తప్పుడు వాక్యాలు చేసిన గరికపాటి నరసింహారావు పై చర్యలు తీసుకోవాలని వారు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు