పార్టీ జిల్లా అధ్యక్షులు అసుదుల్లా
విశాలాంధ్ర ధర్మవరం;; అవినీతి రహిత పాలనను ఆమ్ ఆద్మీ పార్టీ అందజేస్తుందని ఆమ్ ఆత్మీయ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆసదుల్లా, జిల్లా కార్యదర్శి అల్లా ప్రకాష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు ధర్మవరం లో విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయంలో మాట్లాడుతూ ప్రజలందరికీ సంక్షేమ పథకాలతో పాటు అవినీతి రహిత పాలన అందిస్తామని తెలిపారు. పార్టీ వ్యవస్థాపకులు కేజ్రీ వాల్ చేసిన పరిపాలనను వారు గుర్తు చేశారు. ఢిల్లీలో రెండుసార్లు పరిపాలన సాగించడం జరిగిందన్నారు. ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రంలో కూడా మా పార్టీ పరిపాలన చేస్తుందన్నారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఆమ్ ఆద్మి పార్టీని విస్తరింప చేసే పనిలో ఉన్నామని తెలిపారు. ధర్మవరం నియోజకవర్గ వ్యాప్తంగా స్థానిక ఎన్నికల్లో కూడా మా పార్టీ అభ్యర్థులను నిలుపుతామని తెలిపారు. ఇందులో భాగంగానే ధర్మవరం నియోజకవర్గ నూతన కోఆర్డినేటర్ గా హరికృష్ణ కుమ్మరను ఏకగ్రీవంగా ఎంపిక చేసామని, అదేవిధంగా జిల్లాలో ప్రాంతములవారీగా ఇన్చార్జిలను కూడా నియమించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.
అవినీతి రహిత పాలనను ఆమ్ ఆద్మీ పార్టీ అందిస్తుంది..
- Advertisement -
RELATED ARTICLES


