Friday, February 21, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఅబాకస్ విద్య మెదడుకు మరింత పదును పెడుతుంది

అబాకస్ విద్య మెదడుకు మరింత పదును పెడుతుంది

కరస్పాండెంట్, హెడ్మాస్టర్ సీతాపతి రావు
విశాలాంధ్ర ధర్మవరం:: అబాకస్ విద్య మెదడుకు మరింత పదును పెడుతుందని కరెస్పాండెంట్, హెడ్మాస్టర్ సీతాపతి రావు, అబాకస్ (వేదిక్ మాథ్స్) ఇంచార్జ్ వాసవి, పాఠశాల ఇన్చార్జి భువనేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని కాయగూరల మార్కెట్ వద్ద గల సాధన ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో అబాకస్ జాతీయ స్థాయిలో ఎంపికైన వి. జాహ్నవికు అభినందన సభను ఏర్పాటు చేశారు. ఈ అభినందన సభలో వి జాహ్నవిని పాఠశాల కరెస్పాండెంట్, హెడ్మాస్టర్ సీతాపతి రావు, వేదిక్ మాథ్స్ ఇంచార్జ్ వాసవి, వేదిక్ మాథ్స్ (అబాకస్) టీచర్ మంజులా దేవి, పాఠశాల ఇంచార్జ్ భువనేశ్వరి, పాఠశాల ఉపాధ్యాయ బృందం, పాఠశాల కమిటీ, పాఠశాల విద్యార్థులు అందరూ కలిసి సర్టిఫికెట్, మెమెంటోళ్లను అందజేస్తూ అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మా పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న జాహ్నవి తొలుత ధర్మవరంలో జరిగిన అబాకస్ పోటీలలో జిల్లా స్థాయికి రావడం, తదుపరి విజయవాడలో రాష్ట్రస్థాయికి రావడంతో పాటు అక్కడే జాతీయ స్థాయికి ఎంపిక కావడం నిజంగా గర్వించదగ్గ విషయమని తెలిపారు. మా పాఠశాలలో చదువుతోపాటు వివిధ క్రీడా పోటీలు, విజ్ఞాన పోటీలకు కూడా దోహదం చేస్తూ విద్యార్థులను ప్రోత్సహించడం జరుగుతోందని తెలిపారు. మార్చి నెలలో హైదరాబాదులో అబాకస్ జాతీయ పోటీలకు పాల్గొంటుందని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు