భూ యజమానులు తీసుకున్న రుణాలుతో సంబంధం లేకుండా పంటరుణాలు అందించాలి ఎ.కాటమయ్య, పి.జమలయ్యలు డిమాండ్
విశాలాంధ్ర- అనంతపురం : కౌలు రైతులందరికీ జాయింట్ లైబిలిటీ గ్రూపులు ఏర్పాటు చేసి భూయేసి మానులు తీసుకున్న రుణాలతో సంబంధం లేకుండా పంటరుణాలు అందించాలని ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎ. కాటమయ్య పి. జమలయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతపురంలోని సిపిఐ కార్యాలయంలో బుధవారం జిల్లా కౌలురైతుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా కౌలురైతుల రక్షణ వారి సంక్షేమానికి నూతన చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చిందని ఏడు నెలలు పూర్తి అవుతున్న ఆ చట్టం గురించి ప్రస్తావించకపోవడం దురదృష్టకరమన్నారు. సమగ్రమైన చట్టం లేకపోవడం వల్ల కౌలురైతులు గుర్తింపు కార్డులు పొందలేకపోతున్నారని, తద్వారా పంట రుణాలు తీసుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. కౌలురైతులు పండించిన పంటలను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోలేక ప్రైవేట్ వ్యాపారస్తులకు అమ్ముకొని నష్టపోతున్నారని అన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నూతన కౌలుచట్టాన్ని తీసుకు వచ్చి కౌలు రైతులకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ ఆరు నెలల కాలంలో వందమంది పైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే అందులో 99 శాతం కౌలు రైతులేనని వీరికి ఎక్స్ గ్రేషియా చెల్లించకపోవడం దుర్మార్గమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆత్మహత్యలు చేసుకున్న భాదిత రైతు,కౌలురైతుల కుటుంబాలకు పది లక్షల రూపాయలు చొప్పున ఎక్సి గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా భూములేని కౌలురైతుల అందరికీ పెట్టుబడి సాయం అందించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు.రైతుల పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ఏమో కానీ కనీసం మద్దతు ధరలు కూడా దక్కని పరిస్థితి ఏర్పడిందన్నారు. ధాన్యం, కందులు పత్తి, వేరుశనగ తదితర పంటలకు కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ విఫలమైందన్నారు. మద్దతు ధరల ప్రకారం ప్రభుత్వ ఏజెన్సీలతో పాటు ప్రైవేటు వ్యక్తులు కూడా కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. కరువు ప్రాంతాలుగా ప్రకటించిన అన్ని మండలాల్లో పంటలు వేసి దెబ్బతిన్న కౌలురైతులకు ఇన్పుట్ సబ్సిడీ, భీమా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిరుతల మల్లికార్జున మాట్లాడుతూ… అనంతపురం జిల్లాలో 31 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి తక్షణమే పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అతివృష్టి, అనావృష్టి వల్ల నష్టపోతున్న రైతాంగానికి పంట రుణాలను మాఫీ చేసి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం జిల్లా అధ్యక్షులు డి.చెన్నప్ప యాదవ్, ఆంధ్రప్రదేశ్ కౌలురైతులసంఘం అధ్యక్ష కార్యదర్శులు నీలపాల రామకృష్ణ. వి.టి రామాంజనేయులు, రైతుసంఘం నాయకులు పి. వన్నారెడ్డి, వి.వెంకటరాముడు,రైతు మహిళ నాయకురాలు లలితమ్మ, మరియు టి.నాయణ స్వామి,
రాము,రామంజనేయులు,గగోపాల్
తదితరులు పాల్గొన్నారు.