Saturday, January 18, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిప్రమాద బీమా జీవితానికి వెలుగు ఇస్తుంది..

ప్రమాద బీమా జీవితానికి వెలుగు ఇస్తుంది..

ఎస్బిఐ రీజినల్ మేనేజర్ శశిధర్
విశాలాంధ్ర ధర్మవరం:: ప్రమాద బీమా ప్రతి కుటుంబానికి జీవితములో వెలుగును ఇస్తుందని ఎస్బిఐ రీజినల్ మేనేజర్ శశిధర్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని కాయగూరల మార్కెట్ వద్ద గల ప్రధాన శాఖ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మండల పరిధిలోని గొట్లూరు గ్రామానికి చెందిన రామాంజనేయులు కు ప్రమాద బీమాకు చెందిన 20 లక్షల చెక్కును రీజినల్ మేనేజర్ శశిధర్ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా శశిధర్ మాట్లాడుతూ రామాంజనేయులు భార్య రత్న ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిందని, రత్నాకి సంబంధించిన స్టేట్ బ్యాంక్ ఖాతాకి ప్రమాద బీమా చెల్లించినందువల్ల మృతురాలి కుటుంబానికి ఈ లబ్ధి చేకూరుందని తెలిపారు. ఇటువంటి సదుపాయాన్ని బ్యాంకులోని ఖాతాదారులందరూ కూడా వినియోగించుకోవాలని చీఫ్ మేనేజర్ సందీప్ తెలిపారు. స్టేట్ బ్యాంకు సామాజిక సేవా దృక్పథంతో తక్కువ ప్రీమియంతో భీమా అందిస్తుందని చీఫ్ మేనేజర్ వై వి ఆర్ నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో నరసింహారెడ్డి, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు