డిఆర్ఓ మాలోల కు వినతి పత్రం అందజేసిన సిపిఐ నగర కార్యదర్శి ఎన్ శ్రీరాములు
విశాలాంధ్ర -అనంతపురం : ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ వైద్యం అందించని సవేరా హాస్పిటల్ పై చర్య తీసుకోవాలని సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ స్పందన కార్యక్రమంలో డిఆర్ఓ మాలోలకు సిపిఐ నగర కార్యదర్శి ఎన్ శ్రీరాములు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… స్థానిక కల్పనా జోషి కాలనీలో నివాసం ఉంటున్న బి.శివప్రసాద్ భార్య బి సుజాత కల్పన జోషి, భర్త వృత్తి రీత్యా మెడికల్ రేప్ గా పనిచేస్తున్నాడు గత నెల జనవరి 15న కళ్యాణదుర్గం లో టీ సర్కిల్ ఆర్టీసీ బస్సు డీ కొట్టడం వల్ల కాళ్లు నుజు తీవ్ర గాయాలతో కే రన్ క్యూరా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారన్నారు. తీవ్ర మనస్థాపనతో గత నెల పది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న భర్త చూసి సుజాత జనవరి 28వ తేదీన కేర్ అన్ క్యూర హాస్పిటల్ నందు ఛాతీ నొప్పి రావడంలో అక్కడ ఉన్న సిబ్బంది అడ్మిట్ చేయగా డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో తాత్కాలిక వైద్యం అందించారన్నారు. అక్కడ ఉండే యాజమాన్య సవేరా హాస్పిటల్ సందీప్ తో మాట్లాడి రాత్రి 12 గంటలకు అక్కడికి రెఫెర్ చేయడం జరిగిందన్నారు. సవేరా హాస్పిటల్ లో ఎమర్జెన్సీలో అడ్మిట్ చేయగా 2 డియాగో పరీక్ష చేసి హార్ట్ ఎటాక్ వచ్చిందని నిర్ధారించి ఎన్ జి గ్రాం చేయాలని అత్యవసర చికిత్స ఇవ్వాలని ట్రీట్మెంట్ కు ముందుగానే డబ్బులు జమ చేయాలన్నారు. ఆరోగ్యశ్రీ ఉందని కే రన్ క్యూర్ డాక్టర్ రెఫెర్ చేయగా ఇక్కడ రావడం జరిగిందని ఆరోగ్యశ్రీ కింద మాకు చికిత్స ఇవ్వాలని కోరడం జరిగిందన్నారు. ఆరోగ్యశ్రీ కింద మేము చిక్కిత్స చేయము డబ్బులు కడితేనే చికిత్స ఇస్తామని చెప్పి అక్కడ ఉండే యాజమాన్యం చెప్పగా ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందవచ్చు అని బోర్డు ఉంది కదా ఎందుకు చికిత్స ఇవ్వరు అని మేము, బంధువులు అడగగా మా మేనేజ్మెంట్ ఆరోగ్యశ్రీ కింద చికిత్స ఇవ్వమని చెప్పమన్నారని చెప్పడం జరిగిందన్నారు. మీరు వేరే హాస్పిటల్ లకు వెళ్లవలసిందిగా చెప్పి ఆమె ను రాత్రి 2 గంటలకు ఎమర్జెన్సీ చేర్చుకున్నందుకు 5000 రూపాయలు డబ్బులు కట్టించుకుని డిశ్చార్జ్ చేశారన్నారు. అత్యవసరంగా ఉన్నప్పుడు చికిత్స ఇవ్వాల్సిందిగా ప్రభుత్వ నిబంధన ఉన్నప్పటికీ ప్రాణాలు పోతున్నా లెక్కచేయకుండా చివరి క్షణాల్లో మార్క్ హాస్పిటల్ లో చేర్పించగా అక్కడ ఆరోగ్యశ్రీ కింద ఆమె కు చికిత్స ఇవ్వడం జరిగిందన్నారు. ఇటువంటి చిక్కచ్చి ఇవ్వకుండా వారి తో డబ్బులు వసూలు చేసిన సవేరా హాస్పిటల్ పైన చర్యలు తీసుకొని,పేద ప్రజలను నడ్డి విడుస్తున్న ఈ హాస్పిటల్ లపై లైసెన్స్ క్యాన్సిల్ చేయాలని చెట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని సీపీఐ నగర సమితి డిమాండ్ చేస్తూ వినతిపత్రం అందజేయడం జరిగిందన్నారు. డిఆర్ఓ మాలోల స్పందిస్తూ వెంటనే డిఎంహెచ్వో ఈ. బి. దేవి, ఆరోగ్యశ్రీ ఆర్డినేటర్ కిరణ్ కుమార్ కి పిలిపించి చెప్పడంతో డి ఎం అండ్ హెచ్ ఓ వెంటనే షోకాస్ నోటీసు సవేరా హాస్పిటల్ పంపిస్తానని చెప్పడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి శ్రీరాములు సహాయ కార్యదర్శిలు రమణ, అల్లిపీర, ఏ.ఐ.వై.ఫ్ జిల్లా కార్యదర్శి సంతోష్ కుమార్, ఇన్సఫ్ జిల్లా కార్యదర్శి బంగారు బాషా, నగర కార్యవర్గ సభ్యులు రామంజీ, సుందర్ రాజ్ , శ్రీనివాస్ అనంతపురం ఇన్షాప్ నగర అధ్యక్ష కార్యదర్శులు చాంద్ భాషా, ఖాజా మొహిద్దిన్, ఏఐవైఎఫ్ నగర అధ్యక్ష కార్యదర్శులు ఆనందు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు