Wednesday, May 21, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి

ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి

ప్రైవేట్ పాఠశాలలో పాఠ్యపుస్తకాల విక్రయిస్తున్న పాఠశాలను సీజ్ చేయాలి
విశాలాంధ్ర ధర్మవరం;ధర్మవరం పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాల వారు విద్యా సంవత్సరం 2025-2026 ప్రారంభం కాకమునుపే ముందస్తు అడ్మిషన్లు చేపడుతున్నారు అని, ప్రైవేట్ పాఠశాలలో పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్నటువంటి పాఠశాలల పై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలి అని కోరుతూ ధర్మవరం ఆర్డీవో మహేష్కు వినతి పత్రంను పి ఎస్ యు జిల్లా అధ్యక్షులు నందకిషోర్, ఎన్ ఎస్ యు ఐ గణేష్ అనంతరం వారు మాట్లాడుతు ధర్మవరం పట్టణంలో ప్రైవేట్ పాఠశాల వారు విద్యా సంవత్సరం ప్రారంభం కాకమునుపే రంగురంగుల కరపత్రాలతో ప్రచారాలు అడ్మిషన్లు చేపడుతున్నారని పాఠశాల ప్రారంభం కాకమునుపే మా యొక్క పాఠశాలలో అడ్మిషన్ చేసుకోవాలి మా యొక్క పాఠశాల సీబీఎస్సీ మా పాఠశాలలో ఉన్నది అని విద్యార్థులను విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు అని మండిపడ్డారు. అదేవిధంగా మరోవైపు ధర్మవరం పట్టణంలో కొన్ని ప్రైవేట్ పాఠశాల వారు హాస్టల్ పర్మిషన్ లేకపోయినా కూడా ఒక్కో విద్యార్థి దగ్గర నుండి హాస్టల్ పేరిట 80 వేల రూపాయలు నుండి 90 వేల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నారని, అదేవిధంగా మా యొక్క పాఠశాలలోనే పాఠ్యపుస్తకాలు యూనిఫామ్ షూ టై బెల్ట్ లాంటివి మా యొక్క పాఠశాలలోనే కొనుగోలు చేసుకోవాలని విద్యార్థులను, విద్యార్థుల తల్లిదండ్రులను ప్రవేట్ పాఠశాల వారు డిమాండ్ చేయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. పుస్తకాల ఒక్కొక్క సెట్టు 6000 నుంచి 7000 రూపాయల వరకు పాటు పుస్తకాలు విక్రయిస్తున్నారు అని, అదే విధంగా ఏ ఒక్క ప్రైవేట్ పాఠశాల వారు కూడా ప్లీజ్ స్ట్రక్చర్ నోటీసు బోర్డులో అతికించకుండా వేల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నారు అని తెలిపారు. ఆ యొక్క పాఠశాలల పై తక్షణమే శాఖపరమైనటువంటి చర్యలు తీసుకొని ఆ యొక్క పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో భవిష్యత్తులో పాఠశాలలు ఎదుట, ప్రభుత్వ కార్యాలయాల ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుణవరం, రవి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు