Saturday, February 22, 2025
Homeజిల్లాలుకర్నూలువిధులు పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న వైద్యాధికారిపై చర్యలు తీసుకోవాలి

విధులు పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న వైద్యాధికారిపై చర్యలు తీసుకోవాలి

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న వైద్యాధికారిపై చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్య వర్గ సభ్యులు భాస్కర్ యాదవ్, మండల కార్యదర్శి వీరేష్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక సిపిఐ కార్యాలయం నందు సిపిఐ నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్యాధికారి తాహిర్ వలి విధులకు సమయపాలన పాటించక ఇస్టానుసారంగా వేస్తున్నారని ఆరోపించారు. రోగులను కూడా సరిగా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆసుపత్రిలో డాక్టర్ ఉన్నా ఏఎన్ం, జిఎన్ఎం లతో వైద్యం చేయిస్తున్నారన్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్, డిఎంహెచ్ ఓ స్పందించి డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే మండలంలో ముప్పై పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలని గతంలో చాలా సార్లు ప్రభుత్వానికి, అధికారులకు, ప్రజాప్రతినిధులకు చెప్పినా పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. మండలానికి 26 గ్రామాలు ఉన్నాయని, అన్నిటికీ ఇదే ఆసుపత్రి ఉందని, జనభా పెరుగుదల ఎక్కువగా ఉన్నందున ఆసుపత్రిలో పడకలు సరిపోవడం లేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని వెంటనే ముప్పై పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ తాలూకా అధ్యక్షులు జాఫర్ పటేల్, నాయకులు తిక్కన్న, ఇర్ఫాన్ పటేల్, వీరేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు