Thursday, March 6, 2025
Homeజిల్లాలుప్రకాశంనూకవరం ఎస్సీ కాలనీకి వేసే రోడ్డును అడ్డుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి

నూకవరం ఎస్సీ కాలనీకి వేసే రోడ్డును అడ్డుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి

విశాలాంధ్ర -కందుకూరు రూరల్ : నూకవరం ఎస్సీ కాలనీ కి వెళ్లే రోడ్డును అడ్డుకున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కాలనీకి చెందిన పలువురు అభిప్రాయాలు వ్యక్తపరిచారు. ఈ మేరకు మంగళవారం వారు సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజను కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ విషయంలో జరిగిన స్వల్ప వివాదాల్లో గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఎస్సీ కాలనీ వాసులను దుర్భాషలాడారని వినతిపత్రంలో పేర్కొన్నారు. కాలనీకి వెళ్లే రోడ్డులో నేషనల్ హైవే వారు నిబంధనల ప్రకారం తూములను ఏర్పాటు చేశారని, రోడ్డుకు మట్టితోలి చదువు చేసే సమయంలో గ్రామానికి చెందిన ఇంటూరి చెంచమ్మ కుమారుడు లక్ష్మీ నరసింహం అడ్డుపడి అధికారుల దుర్భాషలాడడం కాలనీవాసులను భయభ్రాంతులకు గురి చేయడం జరిగిందన్నారు. గ్రామ సర్పంచ్ కుమారుడు దాచర్ల వెంకట్రావు అది ప్రభుత్వ భూమి అని వాదించినప్పటికీ వినకుండా రోడ్డును చదును చేయకుండా అడ్డుపడ్డారని తెలియజేశారు. ఈ విషయంపై సబ్ కలెక్టర్ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బద్దిపూడి శిఖామని, బద్దిపూడి నరసింహం,బద్దిపూడి ఏసోబు, బద్దిపూడి ఇసాక్, శిరోమణి, సుధాకర్,హరిబాబు, ఇస్రాయిల్, దావీదు, యానాది,సురేంద్ర,సుజన్, కృష్ణ, రాజశేఖర్,జగన్,ఆనంద్,మహేష్,విశాల్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు