Monday, May 12, 2025
Homeజిల్లాలుఅనంతపురంఉపాధి హామీ పనిని జెసిబి తో చేయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి

ఉపాధి హామీ పనిని జెసిబి తో చేయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రెటరీ పెద్దయ్య
విశాలాంధ్ర -శింగనమల : శింగనమల నియోజకవర్గంపుట్లూరు మండలం లోని కందికాపుల గ్రామంలో ఉపాధి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రెటరీ డి పెద్దయ్య, నియోజకవర్గ అధ్యక్షులు రాజు, లు సోమవారం ఉపాధి పనులు పరిశీలనకు వెళ్లారు, ఉపాధి హామీ పనుల పరిశీలనలో నివ్వెరపోయే నిజాలు బయటపడ్డాయి. శ్రామికుల కడుపు కొడుతూ ఉపాధి పనిని జెసిబితో చేస్తున్నారు, ఉపాధికు శ్రామికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఉపాధి పనులు పరిశీలిస్తూ ఉపాధి కూలీలతో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి వివరాలు సేకరిస్తున్నారు, అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రెటరీ డి,పెద్దయ్య మాట్లాడుతూ! పుట్లూరు మండలం లోని కంది కాపుల గ్రామ రెవెన్యూ పొలంలోని ఇందిరమ్మ చెరువులో ఈనెల ఐదో తేదీ నుండి 10వ తేదీ వరకు రెండు ఉపాధి గ్రూపుల ద్వారా ఫారంఫాండ్స్ పనులు చేశారని, ఆ పనులను ఉపాధి కూలీలతో కాకుండా జెసిబి ల తో పనులు చేయించారని, ఇది చాలా దారుణమని తక్షణమే యంత్రాలతో చేసే పనులు ఆపి ఉపాధి కూలీలతో పని చేయించాలని డిమాండ్ చేశారు, యంత్రాలతోపనులు చేపించిన వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని, ఉపాధి కూలీల పొట్ట కొట్టి యంత్రాలతో పనులు చేస్తుంటే అధికారులు కళ్లు మూసుకున్నారాని మండిపడ్డారు. జెసిబి లతో ఫారం పాండ్ పనులు చేస్తుంటే ఉపాధి సిబ్బంది ఏం చేస్తున్నారని, వారి వాటా ఎంతో? చెప్పాలని నిలదీశారు, తీవ్ర కరువు పరిస్థితుల్లో కూలీలకు పనులు దొరకక అల్లాడుతున్న సమయంలో అనేక పోరాటాలతో సాధించుకున్న ఉపాధి హామీ పథకం కూలీలకు కనుమరుగయ్యే పరిస్థితి ఉన్నదని, ఉపాధి పనులకు అవకతవకలు అరికట్టడానికి యంత్రంగాన్ని ఏర్పాటు చేస్తే అధికారులు మొద్దు నిద్ర వహించడం సమంజసం కాదన్నారు. తక్షణమే యంత్రాలతో పని చేయించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ లో పెండింగ్ లో ఉన్న బకాయిలు వెంటనే చెల్లించాలని, ప్రతి ఉపాధి శ్రామికునికి సంవత్సరానికి 12 వేల రూపాయలు ఉపాధి భృతి ఇవ్వాలని, ఉపాధి హామీ కి రాష్ట్ర ప్రభుత్వం వాటా కేటాయించాలని, మెటీరియల్ కంపోనెంట్ 50శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరించాలని, 200 రోజులు పని దినాలు కల్పించి, రోజు కూలీ 700 రూపాయలు ఇవ్వాలని,పనులు చేసే ప్రదేశాలలో మౌలిక వసతులు కల్పించాలని, సకాలంలో వేతనాలివ్వాలని, ఉపాధి హామీపని ఇతర రంగాలకు మల్లించరాదని డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో రాజు, సూరి, తదితరులు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు