విశాలాంధ్ర -రాప్తాడు (అనంతపురం జిల్లా) : గతేడాది ఖరీఫ్ సీజనులో సరైన సమయంలో వర్షాలు కురవక రైతులు సాగుచేసిన పంటలకు పెట్టిన పెట్టబడులు చేతికందక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాప్తాడు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించింది. రైతులు, వ్యవసాయ కూలీలు ఇబ్బంది పడకుండా ఉపాధి హామీ పథకం కింద అదనంగా 50 రోజుల పనిదినాలను కల్పించిందని ఎంపీడీఓ బి.విజయలక్ష్మి గురువారం తెలిపారు. వంద రోజులు పూర్తి చేసుకున్న కూలీలు అదనంగా కేటాయించిన ఈ 50 రోజులను కూలీలు మార్చి 31వ తేదీ లోపు వినియోగించుకోవచ్చన్నారు.