విశాలాంధ్ర ధర్మవరం;; గృహ వినియోగదారులకు అదనపులోడు క్రమబద్దీకరణకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం 50 శాతము రాయితీ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని ధర్మవరం విద్యుత్ ఏడి లక్ష్మీనరసింహారెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ పెరిగిన విద్యుత్ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామ మండల కేంద్రాలు పట్టణ పరిధిలోని మూడు కిలో వాట్లకు దరఖాస్తు చేసుకునేలా ముందుగానే సంబంధిత విద్యుత్ అధికారులు వినియోగదారులకు సూచించడం జరిగిందని తెలిపారు. అదనపు లోడు అనగా కొత్తగా కనెక్షన్ తీసుకునే సమయంలో గృహోపకరణాల వినియోగాన్ని అంచనావేసి కిలోవాట్లలో లెక్కిస్తామని తెలిపారు. ఈ మేరకే డెవలప్మెంట్ చార్జీలు సెక్యూరిటీ డిపాజిట్ వసూలు చేయడం జరుగుతుందన్నారు. గ్రామ మండల కేంద్రాలలో కనీసం రెండు సింగల్ వాట్లు, పట్టణాలలో 3 కిలోవాట్ల ఉంటుందన్నారు. ఈ అవకాశం జూన్ 30 వరకు ప్రభుత్వము కల్పించిందని, దరఖాస్తులు ఆన్లైన్ లేదా విద్యుత్ కార్యాలయాలలో అందుబాటులో ఉంటాయని వారు తెలిపారు. కావున వినియోగదారులు ముందుకొచ్చి సర్వీసును క్రమబద్ధయించుకోవాలని తెలిపారు.
విద్యుత్ రాయితీపై అదనపు లోడు క్రమబద్దీకరణ.. విద్యుత్ ఏడి లక్ష్మీనరసింహారెడ్డి
RELATED ARTICLES