Thursday, May 1, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిమే రెండున ఆది శంకరాచార్యుల జయంతి వేడుకలు..

మే రెండున ఆది శంకరాచార్యుల జయంతి వేడుకలు..

శంకర జయంతి కమిటీ, గాయత్రీ బ్రాహ్మణ సేవా సంఘం
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో మే రెండవ తేదీ ఆది శంకరాచార్యుల జయంతి వేడుకలను నిర్వహిస్తున్నట్లు శ్రీ శంకర జయంతి కమిటీ వారు గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం వారు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇదే రోజు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు సామూహికంగా ఉపనయన(ఉచితంగా) కార్యక్రమాలు కూడా ఉంటుందని తెలిపారు. అదేవిధంగా నాందిలు చేసుకునేవారు తూచా తప్పకుండా ఉదయం 9 గంటలకే ఆలయంలో ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమం గురువులైన దాడి తోట ప్రసాద్ శర్మ, సరస దత్త మూర్తి లచే నిర్వహించబడునని తెలిపారు. కావున ఈ ఉపనయన కార్యక్రమమునకు విచ్చేసి వటువులను ఆశీర్వదించాలని తెలిపారు. అదేవిధంగా మే ఏడవ తేదీ నుండి 11వ తేదీ వరకు ఐదు రోజులు పాటు బ్రాహ్మణులకు అన్నసంతర్పణ కార్యక్రమం కూడా ఉంటుందని తెలిపారు. ఈ ఐదు రోజులలో హనుమద్వాసన దేవతా, కళ్యాణోత్సవ, రథోత్సవ, వసంతోత్సవ సమారాధనలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి విరాళముగా ఇచ్చువారు సంఘం వారిని సంప్రదించాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు