Thursday, December 26, 2024
Homeఆంధ్రప్రదేశ్ఎయిడ్స్ అవగాహన దినోత్సవం, ర్యాలి నిర్వహణ--ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి

ఎయిడ్స్ అవగాహన దినోత్సవం, ర్యాలి నిర్వహణ–ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి

విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని స్థానిక కె. హెచ్.ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎయిడ్స్ డే (ఎయిడ్స్ వ్యాధి అవగాహన దినోత్సవం ) ను ఎన్ఎస్ఎస్ యూనిట్ ప్రోగ్రామ్ అధికారి డా. బి.గోపాల్ నాయక్ అధ్వర్యంలో, కళాశాల ప్రిన్సిపాల్ డా: కె ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించుకున్నారు. అనంతరం ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ త్రివేణి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం డిసెంబర్ 1న, ప్రజలలో అవగాహన పెంచి, ప్రాణాలను రక్షించడానికి ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పాటిస్తున్నాము అని తెలిపారు. హెచ్‌ఐవి/ఎయిడ్స్‌పై పోరాటంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఏకం చేయడానికి వైరస్‌తో జీవిస్తున్న వారికి మద్దతునిచ్చేందుకు ఈ రోజు ప్రపంచ వేదికగా నిలుస్తుంది అన్నారు. 2024 సంవత్సరం నకుగాను థీమ్ ఁరైట్స్ పాత్: మై హెల్త్, మై రైట్!ఁ. ప్రతి ఒక్కరూ, ప్రతిచోటా, హెచ్ఐవి ప్రసారాన్ని నిరోధించే, సాధ్యమైనంత ఉత్తమమైన సంరక్షణను అందించగల , అంతిమంగా అంటువ్యాధిని అంతం చేసే వనరులు, సేవలకు ప్రాప్యతకు అర్హులని థీమ్ నొక్కి చెబుతుంది అని తెలిపారు.యువకులు ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన పెంచుకోవాలని, అదేవిధంగా ఇతరులకు తెలియజేయాలని, జాగ్రత్తగా ఉండి క్రమశిక్షణగా, మంచి ఆలోచనలతో భవిష్యతును నిర్ణయించుకొని, ముందుకు నడవాలని తెలిపారు. మనం నిత్య జీవితంలో ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరమని, ఎయిడ్స్ పాజిటివ్ వచ్చిన వారిని వివక్ష చూపకుండా వారికి సమాజంలో బ్రతికేలాగా ధైర్యం ఇవ్వాలని తెలియచేసారు.ఈ కార్యక్రమంలో డా. ఎస్.చిట్టెమ్మ, ఎస్. పావని, ఎ.కిరణ్ కుమార్, మీనా, బి. ఆనంద్, శ్రీమతి హైమావతి తదితర అధ్యాపక, అధ్యాపకేతర బృందం ,విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు