విశాలాంధ్ర ధర్మవరం; ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశముల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ,జిల్లా ఎయిడ్స్ నివారణ, నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో సరోజమ్మ కళా బృందం తో వీధి నాటకముల ద్వారా హెచ్.ఐ.వి/ఎయిడ్స్ పై అవగాహనకార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమములో భాగముగా శుక్రవారం ధర్మవరం మండల కేంద్రం లోని కళా జ్యోతి సర్కిల్ నందు వీది నాటకము ద్వారా హెచ్.ఐ.వి/ఎయిడ్స్ వ్యాధి ఎలా వస్తుంది, ఎలా వ్యాపించదు, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత చిన్న చూపు లేకుండా ఎలాగా సమాజములో కలసి జీవించాలి, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ క్షయ వ్యాధి సంబందం గూర్చి, సుఖ వ్యాధులు , చికిత్స గూర్చి,కండోమ్ యొక్క ఉపయోగము గూర్చి వివరించడం జరిగిందన్నారు. హెచ్.ఐ.వి/ఎయిడ్స్ ఏక్ట్ 2017 గూర్చి ప్రజలలో సరోజమ్మ కళా బృందం వారు చక్కగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమములో ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డా..మాధవిలత వైద్యాధికారి డా..నజీర్ , ఐసిటిసి కౌన్సెలర్ వనమాల, ల్యాబ్ టెక్నీషియన్ ఎస్.భార్గవి , శక్తి మైత్రి మహిళా సంఘం పి.యూ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. నారాయణమ్మ, ధర్మవరం ప్రాజెక్ట్ మేనేజర్ నవీన్ కుమార్,ఓ.ఆర్.డబ్ల్యూ త్రివేణి, లక్ష్మీ, కవిత, సరస్వతి గ్రామ పెద్దలు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ధర్మవరం లో ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం
RELATED ARTICLES