ఎయిర్‌బస్ తయారీ సంస్థకు చెందిన విమానాల్లో కీలక సాంకేతిక లోపం బయటపడింది.
ఈ సమస్య కారణంగా భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక ఎయిర్‌బస్ విమాన సేవలు తీవ్ర అంతరాయాన్ని ఎదుర్కొంటున్నాయి.సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం, ముఖ్యంగా ఎయిర్‌బస్ ఃA320 సిరీస్‌ః విమానాల్లో ఈ లోపం గుర్తించారు. సోలార్ రేడియేషన్ ప్రభావంతో విమాన నియంత్రణ వ్యవస్థకు సంబంధించిన కీలక డేటా దెబ్బతిందని ఎయిర్‌బస్ స్పష్టం చేసింది.ఈ నేపథ్యంలో సంబంధిత సాఫ్ట్‌వేర్‌లో తక్షణ మార్పులు, అప్‌డేట్లు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.ప్రపంచ వ్యాప్తంగా సుమారు 6 వేల ఎయిర్‌బస్ విమానాలకు సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడేషన్ చేపట్టాల్సిన అవసరం ఉందని సంస్థ ప్రకటించింది. ఈ ప్రక్రియ సాగుతున్న సమయంలో పలు రూట్లలో విమాన రాకపోకలు ప్రభావితమవుతున్నాయి.
ఎయిర్‌బస్ సాంకేతిక లోపం ప్రభావం.. ఎయిర్ ఇండియా, ఇండిగో ఫ్లైట్లకు అంతరాయం
- Advertisement -
RELATED ARTICLES


