విశాలాంధ్ర -ధర్మవరం ; శ్రీ సత్యసాయి జిల్లా ఏఐఎస్బి జిల్లాస్థాయి ముఖ్య నాయకులు సమావేశం స్థానిక బిసి బాలుర హాస్టల్ నందు నిర్వహించడం జరిగినది.ఏ ఐ ఎస్బి జిల్లా అధ్యక్ష ,కార్యదర్శులు జగదీష్ పోతులయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈ సమావేశం నిర్వహించి వారు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి విద్య సంస్థలు సమస్యల పరిష్కారం కోసం రాజి లేకుండా పోరాటాలు నిర్వహించిన విద్యార్థి సంఘం ఏఐఎస్బి అని వారు తెలియజేశారు. అనంతరం సత్యసాయి జిల్లా ఏఐఎస్బి నూతన కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగినది.ఏఐఎస్బి జిల్లా అధ్యక్షులుగా చంద్రశేఖర్ రెడ్డి, ఏఐఎస్బి సత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పోతలయ్య, కోశాధికారిగా అరుణ్ కుమార్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు గా రవి, చరణ్, మల్లికార్జున, కార్యదర్శులు గా గౌతమ్, పవన్, గోపి, జిల్లా కమిటీ సభ్యులు భానుప్రసాద్ ,అశ్వక్, జయద్, నూరు మొహమ్మద్, అమీన్ హరీష్ లను ఎన్నుకున్నారు ఈ సందర్భంగాఎన్నికైన నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వున్న విద్యాసంస్థల లో వున్నా సమస్యలకోసం రాజిలేని పోరాటాలు నిర్వహించి, సమస్య పరిష్కారం అయ్యేవిదంగా ఏ ఐ ఎస్ బి విద్యార్థి సంఘం గా ముందుకెళ్తాము అని వారు తెలియచేసారు. అనంతరం జిల్లా అధ్యక్షులు గా వున్నా జగదీష్ ను రిలేవ్ చేసి రాష్ట్ర కౌన్సిల్ కి వెళ్లిన సందర్బంగా ఘనంగా సన్మానం సన్మానించారు.
ఏ ఐ ఎస్ బి సత్యసాయి జిల్లా నూతన కమిటీ ఎన్నిక
RELATED ARTICLES