Friday, June 6, 2025
Homeజిల్లాలుఅనంతపురంప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు చేపట్టాలి

ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు చేపట్టాలి

: జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
విశాలాంధ్ర- అనంతపురం : ఈనెల 5వ తేదీన నిర్వహించే ప్రపంచ పర్యావరణ దినోత్సవం కోసం అన్ని ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం – 2025 ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ కాలుష్యాన్ని నివారిద్దామనే నినాదంతో ప్రపంచ పర్యావరణ దినోత్సవం – 2025ను నిర్వహించడం జరుగుతోందన్నారు. ఆత్మకూరు మండలం పంపనూరు వద్దనున్న నగరవనంలో ఈనెల 5వ తేదీన గురువారం ఉదయం 10 గంటలకు నిర్వహించే ప్రపంచ పర్యావరణ దినోత్సవం జిల్లా కార్యక్రమం కోసం ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలన్నారు. మంచి స్ఫూర్తితో ప్లాంటేషన్ కార్యక్రమాన్ని చేపట్టాలని, ప్లాంటేషన్ జిల్లాకు ఎంతో ఉపయోగపడే కార్యక్రమన్నారు. ఆయా శాఖల జిల్లా అధికారులు కూడా ప్లాంటేషన్ చేపట్టాలని, 5వ తేదీ తర్వాత ప్రతిరోజు ఒక శాఖ తరపున నిర్వహించే ప్లాంటేషన్ కార్యక్రమంలో తాను పాల్గొనడం జరుగుతుందన్నారు. నగరం, పట్టణ ప్రాంతాల్లో అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టడం జరుగుతోందని, మొక్కలు నాటిన తర్వాత వాటిని సంరక్షించేలా ఒక్కో మొక్కను ఒకరికి దత్తత ఇవ్వాలని, వారి చేత మొక్కలను సంరక్షిస్తానని ప్రతిజ్ఞ చేయించాలన్నారు. మొక్కలను నాటిన తర్వాత దానిని జియో ట్యాగ్ చేయాలన్నారు. ప్లాంటేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు .ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం – 2025 కు సంబంధించిన పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జిల్లా అటవీ శాఖ ఫ్లయింగ్ స్క్వాడ్ గురు ప్రభాకర్, డ్వామా పిడి సలీం భాష, డిపిఓ నాగరాజు నాయుడు, జెడ్పి సీఈవో రామసుబ్బయ్య, డిసిఓ అరుణకుమారి, హార్టికల్చర్ డిడి నరసింహారావు, బీసీ వెల్ఫేర్ డిడి కుష్బూ కొఠారి, డిటిడబ్ల్యూఓ రామాంజనేయులు, డిఎండబ్ల్యూఓ రామసుబ్బారెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ బాలస్వామి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈఈ మునిప్రసాద్, నగరపాలక సంస్థ ఈఈ షాకీర్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు