విశాలాంధ్ర ధర్మవరం;; ఆరోగ్యం పట్ల ప్రజలందరూ చక్కటి శ్రద్ధను కనపరచాలని పల్మలాలజిస్ట్ డాక్టర్ కె. పూర్ణచంద్ర తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని పుట్టపర్తి రోడ్, సాయిబాబా గుడి వద్ద గల స్పందన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఊపిరితిత్తుల జాతి జబ్బుల ఉచిత వైద్య శిబిరమును హాస్పిటల్ అధినేతలు డాక్టర్ బషీర్, డాక్టర్ సోనియాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఊపిరితిత్తులు, చాతి జబ్బుల ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ పూర్ణ చంద్ర వైద్య చికిత్సలను పూర్తిగా ఉచితంగా అందించడం జరిగిందన్నరు. ఈ శిబిరంలో 88 మందికి ఉచితంగా వైద్య చికిత్సలతో పాటు మందులు కూడా పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా అవసరమైన పరీక్షలకు 50 శాతంతో మాత్రమే రాయితీని ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ శిబిరమును ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఆరోగ్యం పట్ల తీసుకున్న శ్రద్ధ పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇటువంటి శిబిరమును నిర్వహించడం పట్ల కూడా ప్రజలు కృతజ్ఞతలు డాక్టర్ బషీర్, డాక్టర్ సోనియాకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ మేనేజర్ బాబా ఫక్రుద్దీన్, దిల్దార్, నర్సులు పాల్గొన్నారు.
ఆరోగ్యం పట్ల ప్రజలందరూ చక్కటి శ్రద్ధను కనపరచాలి.. డాక్టర్ కె. పూర్ణచంద్ర
RELATED ARTICLES