లయోలా హై స్కూల్ కరెస్పాండెంట్ దంపతులు శంకర నాయుడు, వనజ
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ లో లయోలా తెలుగు మీడియం పాఠశాలలో 2001-2004 బ్యాచుకు సంబంధించిన విద్యార్థులందరూ ఆత్మీయ అనుబంధ సమ్మేళనా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమ్మేళనంలో ఉపాధ్యాయులు వారి యొక్క అనుభవాలతో మాతో పంచుకోవడం మా యొక్క అనుభవాలను వాళ్లతో పంచుకోవడం మాకు గుర్తుండ జ్ఞాపకాలు అన్నిటిని కూడా వారికి తెలియజేయడం జరిగింది అని తెలిపారు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ ఆనంద సమ్మేళనం అనేది ప్రతి మనిషి జీవితంలోని ఒక అనుభవం లాంటిదని తెలిపారు. జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ భవిష్యత్ తరాలకు తెలియజేస్తామని పూర్వ విద్యార్థులు తెలిపారు. ఒకే వేదికకు ఇంతమంది పూర్వ విద్యార్థులు రావడం అపూర్వ కలయిక, జీవితములో మరుపురాని ఘటనగా వారు తెలిపారు. ఇలాంటి సమ్మేళనాలు మరీ మరీ జరుపుకోవాలని, ఎన్నెన్నో విద్యాబుద్ధులు నేర్చుకోవాలని, భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థాయికి చేరుకోవాలని శంకర్ నాయుడు తెలిపారు. గత 20 సంవత్సరాల తీపి గుర్తులను గుర్తు చేసుకొని విద్యార్థులకు తమ ఉపాధ్యాయులతో ఉన్న అనుబంధాలను నెమరు వేసుకుంటూ ఆనందోత్సవాలతో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. తదుపరి శంకర్ నాయుడు దంపతులతో పాటు గురువులైన శివయ్య, పురుషోత్తం, అమానుల్లా, నాగార్జున ,పద్మ, చంద్రశేఖర్, గురు ప్రసాద్, చంద్రశేఖర్ గౌడ్, బాలవికాస్, క్లాస్ టీచర్ శ్రీనివాసులు, చండ్ర యుడు, ఆంజనేయులు లను ఘనంగా శాలువాతో, పుష్పగుచ్చం,మెమొంటోలను ఇస్తూ సత్కరించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు దాదాపు నూరు మందికి పైగా పాల్గొన్నారు.