ధర్మవరం చేనేత నాయకులు
విశాలాంధ్ర ధర్మవరం;; ఐకమత్యము సమన్వయముతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని ధర్మవరం చేనేత నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విజయవాడలో ఏర్పాటుచేసిన ఆలిండియా వీవర్స్ ఫెడరేషన్ సమావేశంలో వారు పలు విషయాల పై చర్చించారు. అనంతరం ధర్మవరం చేనేత నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారిన మన సమస్యలు పరిష్కారం కావని, రాజకీయాలకు అతీతంగా అందరం ఐక్యమత్యంతో సమస్యను పరిష్కరించుకునే దిశలో ముందడుగు వేయాలని తెలిపారు. ప్రభుత్వం దృష్టికి చేనేత సమస్యలను పరిష్కరించే దిశలో నిరంతర ప్రక్రియగా పోరాడినప్పుడే సమస్యలు సులభతరంగా పరిష్కారం అవుతాయని తెలిపారు. ఇటీవలే ధర్మవరంలో చేనేత వ్యాపారస్తుల సమస్యలు పరిష్కరించడానికి కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాదు రాజకీయాలు కతీతంగా సన్మానించడం జరిగిందని, ఆ సభలోనే కేవలం చేనేత వ్యాపారస్తుల, చేనేత సమస్యలపై ఐక్యంగా ఉంటూ ఏపీలోని ప్రతి జిల్లాలో కూడా సమస్యలపై పోరాడు పోరాడుతూ ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్లాలని తెలిపారు. చేనేతల వృత్తిలో మనము ఉన్నాము కాబట్టి మన సమస్యలను మనం పరిష్కరించే విధంగా ప్రణాళికలు తయారు చేసుకొని, ప్రభుత్వ సహాయాన్ని పొందినప్పుడే అందరికీ న్యాయం తో పాటు జీవనాధారం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, పరిసే సుధాకర్, గడ్డం శ్రీనివాసులు, గుద్దిటి రాము, జయశ్రీ, గిర్రాజు రవి, గుండా పుల్లయ్య, బీరే శ్రీనివాసులు, నీలూరి శ్రీనివాసులు, చెలిమి శివరాం, ఉడుగుండ్ల వాసు తదితరులు పాల్గొన్నారు.