Tuesday, April 15, 2025
Homeఆంధ్రప్రదేశ్పవన్ కల్యాణ్‌ను కలిసి పరామర్శించిన అల్లు అర్జున్

పవన్ కల్యాణ్‌ను కలిసి పరామర్శించిన అల్లు అర్జున్

ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలిశారు. సింగపూర్‌లో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న హైదరాబాద్‌లో పవన్ కల్యాణ్‌, ఆయన కుటుంబ సభ్యులను కలిసిన అల్లు అర్జున్ బాలుడు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన మార్క్ శంకర్ అక్కడ చికిత్స అనంతరం కోలుకున్నాడు. కుమారుడిని చూసేందుకు కుటుంబంతో కలిసి వెళ్లిన పవన్.. మార్క్ శంకర్‌తో కలిసి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పవన్ ను కలిసి పరామర్శించిన అల్లు అర్జున్.. బాలుడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు