మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు చిన్న తంబి చిన్నప్ప
విశాలాంధ్ర- ధర్మవరం ; చదువుతోపాటు వివిధ పోటీల్లో రాణించడం కూడా చదువులో ఒక భాగం అని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు చిన్న తంబి చిన్నప్ప, కార్యదర్శి మంజునాథ్ తెలిపారు. ఈ సందర్భంగా కొత్తపేటలో గల మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలలో (ఎస్పీసీఎస్)”జన్మనిచ్చిన తల్లిదండ్రులకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు ఆచరించదగ్గ విషయాలు”అనే అంశంపై వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఈ వ్యాసరచన పోటీలలో ప్రధమ ద్వితీయ తృతీయ స్థానాలలో వచ్చిన లిఖిత్ కుమార్, చరణ్ కుమార్, హర్షిత అను విద్యార్థులకు ఇంచార్జ్ హెడ్మాస్టర్ భాస్కర్ చేతుల మీదుగా మెమొంటోలు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమం నిర్వహణ పట్ల పాఠశాల ఉపాధ్యాయులు హెడ్మాస్టర్లు సేవా సంస్థకు కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పెద్దారెడ్డి, చంద్రశేఖర్, కోశాధికారి చంద్రశేఖర్, డైరెక్టర్లు మనోహర్ గుప్తా, గట్టు వెంకటేశులు, బి. రామకృష్ణ, విద్యార్థులు పాల్గొన్నారు.
చదువుతోపాటు వివిధ పోటీల్లో రాణించడం కూడా చదువులో ఒక భాగమే..
RELATED ARTICLES