Tuesday, April 15, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఘనంగా అంబేద్కర్ జయంతి..

ఘనంగా అంబేద్కర్ జయంతి..

*సీఎంఆర్ఎఫ్ ద్వారా 6,26,664/ రూ”లు చెక్కులు పంపిణీ చేసిన తెదేపా నేతలు.
విశాలాంధ్ర ధర్మవరం; భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135 జయంతి కార్యక్రమం ధర్మవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో గల కళాజ్యోతి సర్కిల్లో గల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ,డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నేటి యువతకు ప్రజలకు స్ఫూర్తిదాయకమని అంబేద్కర్రాసిన రాజ్యాంగంతో ఎంతోమంది ఉన్నత శిఖరాలకు వెళ్లడం జరుగుతోందని తెలిపారు. అదేవిధంగా భారతదేశ మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశ ఎదుగుదలకు ఆర్థిక శాస్త్రవేత్తగా, సంఘసంస్కర్తగా, రాజకీయ నేతగా ఆయన చేసిన సేవలను భారతదేశ ఎన్నటికీ మరువదని, అంబేద్కర్ చూపిన అడుగుజాడల్లోనే నేటికీ మనం ముందుకు నడవడం ఎంతో ఆనందదాయకమని తెదేపా నేతలు అన్నారు.

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

ధర్మవరం నియోజకవర్గ వ్యాప్తంగా పలు వ్యాధులతో బాధపడుతూ ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స చేయించుకున్న 19 మందికి రూ”లు 6,26,664/ విలువగల చెక్కులను తెలుగుదేశం పార్టీ నాయకులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కష్టాల్లో ఉన్నప్పటికిని ప్రజల కష్టాలను దృష్టిలో ఉంచుకొని ఆపన్నులకు అభయ హస్తంగా సీఎంఆర్ఎఫ్ ద్వారా పేదల చికిత్స కోసం నిధులను ధర్మవరం నియోజకవర్గానికి కేటాయించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సీఎంఆర్ చెక్కులు అందుకున్న లబ్ధిదారులు మాట్లాడుతూ జీవితాంతం నారా చంద్రబాబునాయుడు రుణపడి ఉంటామని ఈ సందర్భంగా వినమ్రతతో అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు