విశాలాంధ్ర-రాప్తాడు : భారత రాజ్యాంగ రచయిత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను నెరవేరుస్తామని రాప్తాడు భీమ్ రావ్ యువజన సంఘం నాయకులు అన్నారు. డాక్టర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ అంబేద్కర్ తన జీవితంలో అనేక ఇబ్బందులతో తన జీవితం కొనసాగించారు అంటరానితనం నిర్మూలన కోసం నిరంతరం కృషి చేశారన్నారు. త్వరలోనే రాప్తాడు అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు పూర్తవుతుందన్నారు. . ఈ కార్యక్రమంలో యువజన సంఘం నాయకులు జయరాం, ఓబులేసు, బాలనాగేంద్ర, లింగన్న నరసింహగౌడ్, గంజి నరేష్, రవి, సత్యనారాయణ, విజయ, తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు.