విశాలంద్ర – చోడవరం ( అనకాపల్లి జిల్లా) : చోడవరం పాత బస్టాండ్ సెంటర్లో మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో మేనమామ చేతిలో మేనల్లుడు హత్యకు గురయ్యాడు. దీనిపై పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం స్థానిక లక్ష్మమ్మ గుడి సమీపంలోని రెల్లి వీధిలో నివాసముంటున్న సోమాధుల ప్రేమ్ కుమార్ (27), అతని మేనమామ బంగారు దుర్గ చిత్తు కాగితాలు ఏరుకుంటూ, వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో మద్యం తాగుతూ ఉంటారు. డబ్బులు విషయంలో ఇద్దరూ శుక్రవారం ఉదయం గొడవపడ్డారని తెలిపారు. శుక్రవారం రాత్రి బాగా పొద్దు పోయాక పాత బస్టాండ్ సెంటర్లో ప్రేమ్ కుమార్ ఉన్నట్లు తెలుసుకున్న దుర్గ అక్కడికి చేరుకుని కర్రతో ప్రేమ్ కుమార్ ను గట్టిగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడు తల్లి విశాఖ ఆరిలోవ ప్రాంతంలో నివాసం ఉంటుందని అన్నారు. నిందితుడు దుర్గను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్టేషన్ సీఐ అప్పలరాజు తెలియజేశారు.